ఇక్రిశాట్‌లో బోనులో చిక్కిన చిరుత..!

By Ravi
On
ఇక్రిశాట్‌లో బోనులో చిక్కిన చిరుత..!

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌లో సంచరిస్తున్న చిరుతను అటవీశాఖ అధికారులు బంధించారు. వారం రోజుల నుంచి చిరుత సంచరిస్తున్నట్లు అనుమానం రావడంతో.. డ్రోన్‌ కెమెరాలతో చిరుత సంచారాన్ని రికార్డ్‌ చేసే క్రమంలో రెండు చిరుతలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు రెండు బోన్లను ఏర్పాటు చేశారు. ఒక చిరుత మాత్రం చిక్కినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. మరో చిరుతను బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. చిక్కిన చిరుతను హైదరాబాద్‌లోని జూపార్కుకు తరలించారు. ఇక్రిశాట్ సిబ్బంది, అధికారులు ఈ విషయాన్ని బయటకు రానీయకుండా గోప్యంగా ఉంచుతున్నారు.  గతంలోనూ ఇక్కడ ఒక చిరుతను అధికారులు బంధించారు.

Advertisement

Latest News

జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ చూపించిన గిరిజన విద్యార్థులకు మంత్రి సంధ్యారాణి అభినందనలు..! జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ చూపించిన గిరిజన విద్యార్థులకు మంత్రి సంధ్యారాణి అభినందనలు..!
జేఈఈ మెయిన్స్‌లో మంచి ర్యాంకులు సాధించిన గిరిజన గురుకులాల విద్యార్థులను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి...
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్‌ హాట్‌ కామెంట్స్‌..!
స్వర్ణాంధ్ర -స్వచ్ఛాంధ్రే ప్రభుత్వ లక్ష్యం : బొజ్జల సుధీర్‌రెడ్డి
శ్రీకాళహస్తిలో రోజా దిష్టిబొమ్మకి చెప్పుల దండ..!
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై రఘునందన్‌రావు ఫైర్‌
హైదరాబాద్‌ మారేడ్‌పల్లిలో చైన్ స్నాచింగ్‌..!
తెలంగాణ పోలీస్‌శాఖకు దేశంలోనే ప్రథమ స్థానం లభించడంపై డీజీపీ హర్షం