3 దశాబ్దాల కలని సాకారం చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్‌..!

By Ravi
On
3 దశాబ్దాల కలని సాకారం చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్‌..!

మూడు దశాబ్దాల ప్రజల కలను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సాకారం చేశారు. రూ.3.05 కోట్లతో ప్రతిష్టాత్మకమైన చంగుడి, సరాలి, మాకనాపల్లి రహదారికి శంకుస్థాపన చేశారు. 30 ఏళ్లుగా పాతపట్నం మండలం, అచ్యుతాపురం, అంతరాభ, చంగుడి, సరాలి, అప్పోజిపేట, మాకనాపల్లి గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకుని.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా పీఆర్ నిధులతో బీటీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ రహదారి నిర్మాణంతో 6 గ్రామాల ప్రజల ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. అలాగే ఇచ్చిన హామీని 10 నెలల్లోపే నిలబెట్టుకున్నందుకు.. ఆ గ్రామాల ప్రజలు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఘన స్వాగతం పలికారు. శంకుస్థాపన అనంతరం ఎంజీఆర్‌ మాట్లాడుతూ.. పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధికై కట్టుబడి ఉన్నానని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే సుమారు రూ. 450 కోట్ల నిధులు పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధికై కేటాయించిందని తెలిపారు. పాతపట్నం చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ప్రతీ గ్రామానికీ రహదారి నిర్మిస్తామని.. డోలీ మోత లేని గిరిజన గ్రామాలుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Latest News

కూలీ మూవీలో పూజా హెగ్దే స్పెషల్ సాంగ్.. కూలీ మూవీలో పూజా హెగ్దే స్పెషల్ సాంగ్..
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రజంట్ రజనీకాంత్ తో కలిసి పాన్ ఇండియా మూవీ కూలీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చాలామంది...
ఓజీ ఫస్ట్ సింగిల్ పై క్రేజీ అప్డేట్..
ప్ర‌జాద‌ర్బార్‌కు విన‌తుల వెల్లువ‌..!
హెచ్‌సీయూలో చెట్ల నరికివేతపై సుప్రీం సీరియస్‌..!
జైలర్ 2 లో ఆ స్టార్ యాక్టర్.. అఫీషియల్..
నారాయణపూర్-కొండగావ్ అడవుల్లో ఎన్‌కౌంటర్..?
ఇంద్రకీలాద్రిలో పార్కింగ్‌ చేసిన కారులో నుంచి బంగారం మాయం..!