బడంగ్‌పేట్‌లో కాంగ్రెస్‌ నేతల పాదయాత్ర..!

By Ravi
On
బడంగ్‌పేట్‌లో కాంగ్రెస్‌ నేతల పాదయాత్ర..!

ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఆలోచనల మేరకు రాహుల్‌గాంధీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉద్దేశంతో.. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ అనే నినాదంతో బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌ అల్మాస్‌గూడలో కాంగ్రెస్‌ నేతలు పాదయాత్ర నిర్వహించారు. సామాజిక న్యాయమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంగ్‌పేట్ కార్పొరేషన్ మాజీ మేయర్ చిగురింత పారిజాత అన్నారు. అసమానతలను తొలగించి సమాజంలో అందరికీ సమాన హక్కులను కల్పించడం కోసమే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుందన్నారు. రాజ్యాంగాన్ని అవమానిస్తున్న బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యంపై ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే దేశమంతటా కాంగ్రెస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Latest News

తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయంలో అవినీతి...
శరత్ సిటీ మాల్ వెనుక అపార్ట్మెంట్‌లో డ్రగ్స్ పట్టివేత
సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా
నాన్ డ్యూటీ లిక్కర్‌పై దాడులు పెంచండి : ఆర్ఆర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
జనసేన ఆధ్వర్యంలో అంబలి ప్రసాదం వితరణ..!
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..
అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్..