నేడు చెన్నై, లక్నో కు మధ్య మ్యాచ్ టఫ్ కానుందా?

By Ravi
On
నేడు చెన్నై, లక్నో కు మధ్య మ్యాచ్ టఫ్ కానుందా?

ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు మ్యాచ్ లక్నో వర్సెస్ చెన్నై కి మధ్య జరగనుంది. ఈ సీజన్‌లో లక్నో జట్టు లీగ్ దశలో చెన్నైతో ఒకే ఒక్క మ్యాచ్ ఆడనుంది. కాబట్టి రెండు జట్ల అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగా ఈవెంట్‌లో లక్నో ప్రదర్శన ఇప్పటివరకు అట్రాక్ట్ చేసింది. లక్నో జట్టు గత మూడు మ్యాచుల్లో అద్భుతమైన విజయాలు సాధించింది. మరోవైపు, చెన్నై సూపర్ కింగ్స్ గత ఐదు మ్యాచుల్లో ఫెయిల్యూర్స్ ను ఎదుర్కొంది. ఇటువంటి పరిస్థితిలో ప్లేఆఫ్ రేసులో కొనసాగాలంటే చెన్నై ఏ విధంగానైనా గెలవాల్సిందే అని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

రిషబ్ పంత్ నేతృత్వంలోని లక్నో జట్టు గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి, మూడు బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అదే సమయంలో, చెన్నై గత సీజన్ విజేత కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తన చివరి మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో చెన్నై తన సొంత మైదానంలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. చెన్నై జట్టు బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో ఘోరంగా విఫలమైంది. చెన్నైని ఓడించడం ద్వారా పంత్ జట్టు టోర్నమెంట్‌లో తన విజయ పరంపరను కొనసాగించడానికి ప్రయత్నిస్తుంది. మరి చెన్నై తిరిగి విజయాల ట్రాక్‌లోకి రావాలని కోరుకుంటుంది. మరి ఈ మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారో చూడాలి.

Advertisement

Latest News

బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..! బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..!
హైదరాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!
యథేచ్చగా అక్రమ సెల్లార్ తవ్వకాలు..!
యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్‌పై అవగాహన..!
సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!