ముంబై అరుదైన రికార్డ్ నమోదు..
ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు సెకండ్ సక్సెస్. ఢిల్లీ క్యాపిటల్స్‌ను 12 పరుగుల తేడాతో ఓడించింది. చివరివరకూ ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఢిల్లీని రనౌట్లు ఇబ్బందికి గురి చేశాయి. ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో మూడు రనౌట్లు కావడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. ఈ క్రమంలో ముంబయి ఓ అరుదైన ఘనతను తన అకౌంట్ లో వేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి 205 పరుగులు చేసింది. తర్వాత ఢిల్లీ 193 పరుగులకే ఆలౌటైంది. దీంతో 200+ స్కోరును టార్గెట్‌గా ఫిక్స్ చేసిన 15 మ్యాచుల్లోనూ ముంబై గెలిచింది. ఐపీఎల్ చరిత్రలో ఇలా ఒకే ఓవర్‌లో మూడు రనౌట్లు కావడం ఇది రెండోసారి మాత్రమే.
కాగా ఇది 2008 సీజన్‌లో నమోదైంది. అప్పుడు పంజాబ్ కింగ్స్ ఒక్క పరుగు తేడాతో గెలిచింది. చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. విక్రాంత్‌ను యువరాజ్ రనౌట్ చేసి తన జట్టును గెలిపించాడు. ముంబయి ఇన్నింగ్స్‌లో మొత్తం ఐదు రనౌట్లు అయ్యాయి. ఇప్పటికీ ఇదే ఐపీఎల్‌లో రికార్డు. అందులో మూడు చివరి ఓవర్‌లోనే జరిగాయి. ఒకే వేదికలో అత్యధిక ఓటములు చవిచూసిన జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో కలిసి ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచింది.