బాలయ్య నెక్ట్స్ సినిమా డైరెక్టర్ ఎవరంటే?
బాలయ్య ప్రజంట్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్నారు. ఈ ఇయర్ స్టార్టింగ్ లో డాకు మహారాజ్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఒక స్టైలిష్ మాస్ కమర్షియల్ హిట్ తో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేశారు. నెక్ట్స్ బోయపాటి శ్రీనుతో కలిసి అఖండ 2 పై ఫోకస్ చేశారు. ప్రజంట్ ఈ సినిమా షూటింగ్ బిజీగా సాగుతుంది. ఈ మూవీని ఈ ఇయర్ దసరా స్పెషల్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక అఖండ పార్ట్ 1 లానే ఈ సీక్వెల్ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని అంచనాలు పెంచుకున్నారు. ఇప్పుడు బాలయ్య తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ని కూడా లైన్ లో పెట్టారు.
అయితే ఆయన నటించబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ లో గోపిచంద్ మలినేని, హరీష్ శంకర్ ప్రాజెక్ట్ ఉన్నట్లు తెలుస్తుంది. వీరిద్దరూ కథలు వినిపించారట. అయితే ఇందులో గోపిచంద్ మలినేనితో సినిమా చేయాలని బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ మూవీ అఫిషియల్ అనౌన్స్ మెంట్ బాలయ్య బర్త్ డే స్పెషల్ గా రాబోతుంది. ఈ మూవీలో బాలయ్య లుక్ అండ్ గెటప్ డిఫరెంట్ గా ఉండబోతుందని తెలుస్తుంది. కాగా ఈ సారి గోపీచంద్ మలినేని, బాలయ్యతో చేసే సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఊర మాస్ సినిమా ప్లానింగ్ లో ఉన్నారట. ఈ సినిమను వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మించనున్నారు.