మల్కాజిగిరి: రజతోత్సవ సభ విజయవంతానికి ప్రజల మద్దతు కోరిన కేటీఆర్

By Ravi
On
మల్కాజిగిరి: రజతోత్సవ సభ విజయవంతానికి ప్రజల మద్దతు కోరిన కేటీఆర్

మల్కాజిగిరి: రజతోత్సవ సభ విజయవంతానికి ప్రజల మద్దతు కోరిన కేటీఆర్

బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల వరంగల్‌లో నిర్వహించనున్న రజతోత్సవ సభను ఘనంగా నిర్వహించేందుకు ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు మల్కాజిగిరి నియోజకవర్గాన్ని సందర్శించారు.

కార్యక్రమంలో భాగంగా ఆనంద్ బాగ్ నుంచి మల్కాజిగిరి వరకు భారీ ర్యాలీ నిర్వహించబడింది. ఈ ర్యాలీలో బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం మల్కాజిగిరిలోని లక్ష్మీ సాయి గార్డెన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి ప్రజల సమస్యల పరిష్కారానికి అంకితంగా పనిచేస్తోందని, ప్రజల ఆశీర్వాదంతో పార్టీకి 25 ఏళ్ల ఘన యాత్ర సాధ్యమైందన్నారు. రజతోత్సవ సభను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించిన కేటీఆర్, తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రజలు వారి మోసాన్ని గుర్తించి, రాబోయే కార్పొరేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సభలో మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, వేల సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Latest News

నాన్ డ్యూటీ లిక్కర్‌పై దాడులు పెంచండి : ఆర్ఆర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాన్ డ్యూటీ లిక్కర్‌పై దాడులు పెంచండి : ఆర్ఆర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
నాన్ డ్యూటీ లిక్కర్‌పై దృష్టిసారించి దాడులు ముమ్మరం చేసి గంజాయితోపాటు డ్రగ్స్‌ను అరికట్టాలని రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ దశరథ్ ఆదేశాలు జారీ చేశారు....
జనసేన ఆధ్వర్యంలో అంబలి ప్రసాదం వితరణ..!
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..
అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్..
మిస్‌ ఫైర్‌.. ఇజ్రాయిల్ ప్రజలపై బాంబు?
చైనాకు కోలుకోలేని షాక్ ఇచ్చిన అమెరికా
వారికి రూ.10లక్షలు సాయం ప్రకటించిన బెంగాల్ సీఎం