అలర్ట్.. దేశంలో ఉగ్రదాడులు: నిఘా సంస్థలు

By Ravi
On
అలర్ట్.. దేశంలో ఉగ్రదాడులు: నిఘా సంస్థలు

దేశంలో ఉగ్రదాడులు జరగవచ్చని నిఘా సంస్థలు అలర్ట్ ను ప్రకటించాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు దిగొచ్చని పేర్కొంది. ఈ క్రమంలో రైల్వేశాఖను అప్రమత్తం చేశాయి. డ్రోన్‌, ఐఈడీతో దాడులు జరగవచ్చని హెచ్చరికలు జారీ చేశాయి. నదీమార్గాల్లో తీవ్రవాదులు చొరబడే అవకాశం ఉన్నాయని చెప్పాయి. ముంబయి ఉగ్రదాడి కీలక కుట్రదారు తహవ్వుర్ రాణాను అమెరికా నుంచి భారత్‌కు తీసుకువచ్చి విచారిస్తోన్న తరుణంలో ఈ అలర్ట్ రావడం గమనార్హం. 

కాగా 2008 నవంబర్ 26న 10మంది పాకిస్థానీ ఉగ్రవాదులు సముద్రమార్గం ద్వారా ముంబయికి చేరుకొని.. సీఎస్‌ఎంటీ, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్‌ తదితర ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డారు. నవంబర్ 29 వరకు మారణహోమం కొనసాగింది. ఈ ఘటనల్లో 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మంది ప్రాణాలు కోల్పోగా, అనేకమంది గాయపడ్డారు. అప్పటి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్ హేమంత్ కర్కరే, ఆర్మీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, ముంబయి అదనపు పోలీస్ కమిషనర్ అశోక్ కామ్టే, సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ విజయ్ సలాస్కర్‌లు అమరులైన సంగతి తెలిసిందే

Advertisement

Latest News

శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ భార్య  శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ భార్య 
అగ్నిప్రమాదం నుంచి తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడటంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆమె...
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే లక్ష్యంగా పని చేస్తాం: JCHSL కార్యవర్గం
సన్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో కాంగ్రెస్‌ నేతల సహపంక్తి భోజనం..!
బాలానగర్‌లో ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ద్విచక్ర వాహనదారుడి మృతి
మల్కాజిగిరి: రజతోత్సవ సభ విజయవంతానికి ప్రజల మద్దతు కోరిన కేటీఆర్
కొడుకు మార్క్ శంకర్ తో సింగపూర్ నుండి ఇంటికి చేరుకున్న పవన్ కళ్యాణ్
రూ. 60 లక్షల విలువైన గంజాయి పట్టివేత