రాష్ట్రపతి అనుమతి లేకుండా 10 బిల్లుల ఆమోదం
దేశ చరిత్రలో మొదటిసారి రాష్ట్రపతి, గవర్నర్ అనుమతి లేకుండా 10 బిల్లులు ఆమోదం పొందిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడుకు చెందిన పెండింగ్ బిల్లులు ఆమోదించినట్లుగా తాజాగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెల్లడించింది. తాజాగా తమిళనాడు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి, గవర్నర్ ఆమెదం లేకుండానే 10 చట్టాలను నోటిఫై చేసింది. అంతేకాకుండా దీనిపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
రాజ్యాంగ చరిత్రలో ఈ విధంగా జరగడం ఇదే మొదటిసారి. అసెంబ్లీ ఆమోదం తెలిపిన బిల్లులను గవర్నర్ తన దగ్గరే ఉంచుకున్నారని.. దీనికి ఎలాంటి సమాధానం ఇవ్వలేదని ఆరోపిస్తూ స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వెనక్కి పంపిన బిల్లులను తిరిగి పంపితే.. రెండోసారి ఆమోదించి పంపినా ఆమోదం తెల్పలేదని పేర్కొంది. దీంతో సుప్రీం ధర్మాసనం ఆ బిల్లులు ఆమోదించినట్లుగా పేర్కొంది. ఈ సందర్భంగా గవర్నర్ తీరును తీవ్రంగా తప్పుపట్టింది. కాగా ఈ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.