రాష్ట్రపతి అనుమతి లేకుండా 10 బిల్లుల ఆమోదం

By Ravi
On
రాష్ట్రపతి అనుమతి లేకుండా 10 బిల్లుల ఆమోదం

దేశ చరిత్రలో మొదటిసారి రాష్ట్రపతి, గవర్నర్ అనుమతి లేకుండా 10 బిల్లులు ఆమోదం పొందిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడుకు చెందిన పెండింగ్ బిల్లులు ఆమోదించినట్లుగా తాజాగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెల్లడించింది. తాజాగా తమిళనాడు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి, గవర్నర్ ఆమెదం లేకుండానే 10 చట్టాలను నోటిఫై చేసింది. అంతేకాకుండా దీనిపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

రాజ్యాంగ చరిత్రలో ఈ విధంగా జరగడం ఇదే మొదటిసారి. అసెంబ్లీ ఆమోదం తెలిపిన బిల్లులను గవర్నర్ తన దగ్గరే ఉంచుకున్నారని.. దీనికి ఎలాంటి సమాధానం ఇవ్వలేదని ఆరోపిస్తూ స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వెనక్కి పంపిన బిల్లులను తిరిగి పంపితే.. రెండోసారి ఆమోదించి పంపినా ఆమోదం తెల్పలేదని పేర్కొంది. దీంతో సుప్రీం ధర్మాసనం ఆ బిల్లులు ఆమోదించినట్లుగా పేర్కొంది. ఈ సందర్భంగా గవర్నర్‌ తీరును తీవ్రంగా తప్పుపట్టింది. కాగా ఈ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.WhatsApp Image 2025-04-12 at 3.53.05 PM

Advertisement

Latest News

కరన్‌కోట్‌ ఎస్‌బీఐ బ్యాంకులో అగ్నిప్రమాదం..! కరన్‌కోట్‌ ఎస్‌బీఐ బ్యాంకులో అగ్నిప్రమాదం..!
వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం కరన్‌కోట్ ఎస్‌బీఐ బ్యాంకులో అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు, పొగలు ఎగసిపడతున్నాయి. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు బ్యాంకు సిబ్బంది...
వృద్ధురాలని చంపి శవంపై డ్యాన్స్‌ చేసిన యువకుడు..!
వైల్డ్‌ హార్ట్స్‌ పబ్‌లో అశ్లీల నృత్యాలు..!
ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు..
తెగి పడ్డ హైటెన్షన్ వైర్.. చాదర్ ఘాట్ లో భారీగా ట్రాఫిక్ జామ్..!
కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఇల్లు, ఆఫీసుల్లో సిట్‌ బృందాలు సోదాలు..!
మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు..!