ధోని అవుటా.. కాదా.. అనే నిర్ణయంపై వ్యతిరేకత?
ఐపీఎల్‌లో భాగంగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ దారుణంగా ఫెయిల్ అయ్యింది. మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే 103 పరుగులకే కుప్పకూలింది. అయితే ఈ మ్యాచ్ లో ధోని అవుటా.. కాదా అనే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. థర్డ్ అంపైర్ సైతం అవుట్ ఇచ్చాడు. రివ్యూ సమయంలో బంతి బ్యాట్ దగ్గర నుంచి వెళ్లిన సమయంలో స్క్రీన్‌పై స్పైక్స్ కనిపించాయి. అయినా, ఇవేవీ పట్టించుకోకుండా థర్డ్ అంపైర్ అవుట్ గా అనౌన్స్ చేశారు.. ఈ నిర్ణయంపై అటు సీఎస్‌కే అభిమానులతో పాటు కామెంటేటర్స్ సైతం షాక్ అయ్యారు.
కాగా రీప్లే వీడియోలో బంతి బ్యాట్ వైపు నుంచి వెళ్లిన సమయంలో బంతి బ్యాట్‌కు తాకినా.. అవుట్ ఇవ్వడంతో ఒక పరుగు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కేవలం శివం దూబే మాత్రం 31 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత విజయ్ శంకర్ మాత్రమే 29 పరుగులు చేశాడు. చాలా మంది బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోర్ చేయలేకపోయాడు. ఇక ఐపీఎల్‌లో చెన్నైకి ఇది ఐదో ఫెయిల్యూర్. చెపాక్ లో అత్యల్ప స్కోర్ చేసిన సీఎస్‌కే.. సొంత మైదానంలో వరుసగా మూడో మ్యాచ్‌లో ఓటమిని చవిచూసింది. టాస్ నుంచి సీఎస్‌కేకు ఈ మ్యాచ్‌లో ఏదీ కలిసిరాలేదు. దీంతో అభిమానులు నిరాశపడుతున్నారు.