ధోని అవుటా.. కాదా.. అనే నిర్ణయంపై వ్యతిరేకత?

By Ravi
On
ధోని అవుటా.. కాదా.. అనే నిర్ణయంపై వ్యతిరేకత?

ఐపీఎల్‌లో భాగంగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ దారుణంగా ఫెయిల్ అయ్యింది. మొదట బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే 103 పరుగులకే కుప్పకూలింది. అయితే ఈ మ్యాచ్ లో ధోని అవుటా.. కాదా అనే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. థర్డ్ అంపైర్ సైతం అవుట్‌ ఇచ్చాడు. రివ్యూ సమయంలో బంతి బ్యాట్ దగ్గర నుంచి వెళ్లిన సమయంలో స్క్రీన్‌పై స్పైక్స్ కనిపించాయి. అయినా, ఇవేవీ పట్టించుకోకుండా థర్డ్‌ అంపైర్‌ అవుట్‌ గా అనౌన్స్ చేశారు.. ఈ నిర్ణయంపై అటు సీఎస్‌కే అభిమానులతో పాటు కామెంటేటర్స్‌ సైతం షాక్‌ అయ్యారు. 

కాగా రీప్లే వీడియోలో బంతి బ్యాట్ వైపు నుంచి వెళ్లిన సమయంలో బంతి బ్యాట్‌కు తాకినా.. అవుట్‌ ఇవ్వడంతో ఒక పరుగు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కేవలం శివం దూబే మాత్రం 31 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత విజయ్‌ శంకర్‌ మాత్రమే 29 పరుగులు చేశాడు. చాలా మంది బ్యాట్స్‌మెన్‌ రెండంకెల స్కోర్‌ చేయలేకపోయాడు. ఇక ఐపీఎల్‌లో చెన్నైకి ఇది ఐదో ఫెయిల్యూర్. చెపాక్‌ లో అత్యల్ప స్కోర్‌ చేసిన సీఎస్‌కే.. సొంత మైదానంలో వరుసగా మూడో మ్యాచ్‌లో ఓటమిని చవిచూసింది. టాస్‌ నుంచి సీఎస్‌కేకు ఈ మ్యాచ్‌లో ఏదీ కలిసిరాలేదు. దీంతో అభిమానులు నిరాశపడుతున్నారు.

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!