సీఎస్‌కే ఓటమిపై ధోని రెస్పాన్స్ ఇదే..

By Ravi
On
సీఎస్‌కే ఓటమిపై ధోని రెస్పాన్స్ ఇదే..

స్కోరు బోర్డుపై సరిపడా రన్స్ చేయకపోవడమే తమ ఓటమికి కారణం అని సూప‌ర్ కింగ్స్ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ అన్నారు. గత మ్యాచ్‌ లలో రెండో ఇన్నింగ్స్‌లో కూడా రన్ చేయడంలో ఫెయిల్ అయ్యామని, ఈ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లోనే దారుణంగా ఓటమిపాలయ్యామని అన్నారు. అయితే వేరే ఆటగాళ్లను ఫాలో అవుతూ వారి లాగానే ఆడాలనుకోవడం రాదన్నాడు. పరిధులు దాటి హిట్టింగ్‌ మాత్రమే చేయాలనే దృక్పథం తమకు లేదని, అది చేతకాదు కూడా అని మహేంద్ర సింగ్ ధోనీ అన్నారు. ఐపీఎల్‌ 2025లో భాగంగా శుక్రవారం చెపాక్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌ రైడ‌ర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై దారుణ ఓటమిని ఎదుర్కొంది. 

మ్యాచ్ తర్వాత సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా మాకు ఏదీ కలిసిరావడం లేదు. మా ముందు ఎన్నో సవాళ్లున్నాయి, వాటిని ఎదుర్కొనేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. మేము స్కోరు బోర్డుపై సరిపడా పరుగులు చేయలేదనేది వాస్తవం. రెండో ఇన్నింగ్స్‌లో బంతి కాస్త నెమ్మదిస్తుందని భావించాం కానీ, తొలి ఇన్నింగ్స్‌ నుంచి బ్యాటింగ్‌కు కష్టంగా మారింది. త్వరగా వికెట్లు కోల్పోయినప్పుడు ఒత్తిడి ఉంటుందని ధోనీ అన్నారు.

Advertisement

Latest News

బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..! బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..!
హైదరాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!
యథేచ్చగా అక్రమ సెల్లార్ తవ్వకాలు..!
యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్‌పై అవగాహన..!
సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!