తాడ్‌బండ్‌లో ఘనంగా హనుమాన్ జయంతి..!
సికింద్రాబాద్ తాడ్‌బండ్‌లో హనుమాన్ జయంతి పురస్కరించుకొని దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హనుమాన్ చాలీసా పారాయణాలతో తాడ్‌బండ్ హనుమాన్ దేవాలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆంజనేయ స్వామి దర్శనం నిమిత్తం భక్తులకు ఎలాంటి ఆసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో నరేందర్ అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణమంతా జైశ్రీరామ్ నినాదాలతో మార్మోగుతోంది. ఆలయ పరిసర ప్రాంతాలలో రామలక్ష్మణుల సమేత హనుమంతుడి విశేష అలంకరణతోపాటు విద్యుత్ దీపాల వెలుగులు అందరినీ ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. రకరకాల సెట్టింగులతో కూడిన విద్యుత్ దీపాల కాంతులతో తాడ్‌బండ్ ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణం మెరిసిపోతోంది. ఆలయానికి వచ్చే భక్తులకు ఆలయ నిర్వహణ అధికారి అంబుజ ఆధ్వర్యంలో అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్ల ఏర్పాటుతో పాటు స్వామివారి దర్శనం కలిగే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నారు..