తాడ్‌బండ్‌లో ఘనంగా హనుమాన్‌ జయంతి..!

By Ravi
On
తాడ్‌బండ్‌లో ఘనంగా హనుమాన్‌ జయంతి..!

సికింద్రాబాద్ తాడ్‌బండ్‌లో హనుమాన్ జయంతి పురస్కరించుకొని దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హనుమాన్ చాలీసా పారాయణాలతో తాడ్‌బండ్ హనుమాన్ దేవాలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆంజనేయ స్వామి దర్శనం నిమిత్తం భక్తులకు ఎలాంటి ఆసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో నరేందర్‌ అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణమంతా జైశ్రీరామ్ నినాదాలతో మార్మోగుతోంది. ఆలయ పరిసర ప్రాంతాలలో రామలక్ష్మణుల సమేత హనుమంతుడి విశేష అలంకరణతోపాటు విద్యుత్ దీపాల వెలుగులు అందరినీ ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. రకరకాల సెట్టింగులతో కూడిన విద్యుత్ దీపాల కాంతులతో తాడ్‌బండ్ ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణం మెరిసిపోతోంది. ఆలయానికి వచ్చే భక్తులకు ఆలయ నిర్వహణ అధికారి అంబుజ ఆధ్వర్యంలో అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్ల ఏర్పాటుతో పాటు స్వామివారి దర్శనం కలిగే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నారు..

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!