పిల్లలు వద్దనుకుంటే ఊయలలో వేయండి..!
పసి పిల్లలను వద్దనుకుంటే ఊయలలో వేసి రక్షించండని పిలుపునిచ్చారు శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్. ఆడపిల్లలని, అనారోగ్యవంతులని, అంగవైకల్యం కలవారని లేదా అవాంచిత గర్భం వలన పుట్టిన పసిపిల్లలను వద్దనుకుని.. వారిని చెత్త కుండీలు, ముళ్ల పొదల్లో పారవేయకుండా.. ప్రభుత్వాస్పత్రుల్లో ఏర్పాటు చేసిన ఊయలలో వేయాలని సూచించారు. ఇటువంటి డెలివరీలు జరగకుండా స్త్రీలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని వైద్యాధికారులకు మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారులకు సూచించారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఊయల కార్యక్రమం నిర్వహించారు. ఇలాంటి పిల్లల్ని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ గృహాల్లో సంరక్షించి.. దరఖాస్తు చేసుకున్న తల్లిదండ్రులకు చట్టబద్దంగా దత్తత ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ షకీలా, సీడీపీవో శోభారాణి, టీఎన్‌టీయుసీ అధ్యక్షులు రెడ్డి గిరిజాశంకర్ తదితరులు పాల్గొన్నారు.