పిల్లలు వ‌ద్ద‌నుకుంటే ఊయ‌ల‌లో వేయండి..!

By Ravi
On
పిల్లలు వ‌ద్ద‌నుకుంటే ఊయ‌ల‌లో వేయండి..!

పసి పిల్లలను వద్దనుకుంటే ఊయలలో వేసి రక్షించండ‌ని పిలుపునిచ్చారు శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్‌. ఆడపిల్లలని, అనారోగ్యవంతులని, అంగవైకల్యం కలవారని లేదా అవాంచిత గర్భం వలన పుట్టిన పసిపిల్లలను వద్దనుకుని.. వారిని చెత్త కుండీలు, ముళ్ల పొదల్లో పారవేయకుండా.. ప్రభుత్వాస్పత్రుల్లో ఏర్పాటు చేసిన ఊయలలో వేయాల‌ని సూచించారు. ఇటువంటి డెలివరీలు జరగకుండా స్త్రీలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని వైద్యాధికారులకు మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారులకు సూచించారు. ప్రభుత్వ స‌ర్వ‌జ‌న ఆసుప‌త్రిలో ఊయల కార్యక్రమం నిర్వ‌హించారు. ఇలాంటి పిల్లల్ని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ గృహాల్లో సంరక్షించి.. దరఖాస్తు చేసుకున్న తల్లిదండ్రులకు చట్టబద్దంగా దత్తత ఇస్తామ‌న్నారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్ ష‌కీలా, సీడీపీవో శోభారాణి, టీఎన్‌టీయుసీ అధ్య‌క్షులు రెడ్డి గిరిజాశంక‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!