మీరు ఊరు వెళ్తున్నారా..జర భద్రం అంటూ కాలనీలలో ప్రచారం నిర్వహిస్తున్న తాండూరు పోలీసులు
దొంగతనాల నివారణ గురించి వికారాబాద్ జిల్లా తాండూర్ పోలీసులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇతర ఊర్లకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతీ ఇంటికి సీసీ కెమెరాల ఏర్పాటు ఉపయోగకరమని ఆటోలో మైక్ ఏర్పాటు చేసి మరీ ప్రజలను చైతన్యం చేస్తున్నారు. పండగలు, సెలవులలో టూర్ల నిమిత్తం ఇతర గ్రామాలకు వెళ్లే ప్రజలు అన్ని విధములైన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా తాండూర్ పోలీసులు పట్టణంలోని గల్లీ గల్లీలో మైక్ అనౌన్స్ మెట్ చేపట్టారు. ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా ఊర్లకి వెళ్లే సందర్భం ఉన్న నేపథ్యంలో దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుందని కావున ప్రజలు అప్రమత్తతతో వ్యవహరించాలన్నారు. డబ్బు, బంగారం ఇంట్లో ఉండకుండా చూసుకోవాలని కోరారు. తమ ఇంటికి మరియు కాలనీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తద్వారా ఎలాంటి సంఘటనలు జరిగినా ప్రతి స్పందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల దొంగతనాలు జరిగే అవకాశం తక్కువగా ఉంటుందన్నారు. ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడితే 100 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి సమాచారాన్ని తెలపాలని సూచించారు.