మాజీ మంత్రి పెద్దిరెడ్డి ని కలిసిన వైసిపి నాయకులు..

By Ravi
On
మాజీ మంత్రి పెద్దిరెడ్డి ని కలిసిన వైసిపి నాయకులు..

ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రియశీల కార్యదర్శి టి రాకేశ్ కిరణ్, రిటైర్డ్  జిల్లా జడ్జి దొరస్వామి, తిరుపతిలోని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అయన  నివాసంలో మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతికి దెబ్బ తగలడంతో వారిని కలిసి, ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సత్యవేడు కు చెందిన మరి కొంతమంది వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు. వారు  మాట్లాడుతూ కూటమి  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలు చేస్తామని చెప్పిందని, కానీ మండలాలలో పేదవారికి అందడం లేదని వారు అన్నారు. సత్యవేడు నియోజకవర్గంలో వెనుకబడిన ప్రాంతం కాబట్టి, అన్ని విధాలుగా వైఎస్సార్సీపీ పార్టీని బలోపేతం చేసి రానున్న రోజుల్లో పార్టీ సభ్యత్వాలు బారీగా  నమోదు చేయాలని అన్నారు. ఎక్కడ చూసినా కూడా వైసిపి నాయకులకు చేదు అనుభవం తగులుతుందని, పార్టీలు చూడకుండా పేదవారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని వారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వివరించారు.

Advertisement

Latest News

తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయంలో అవినీతి...
శరత్ సిటీ మాల్ వెనుక అపార్ట్మెంట్‌లో డ్రగ్స్ పట్టివేత
సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా
నాన్ డ్యూటీ లిక్కర్‌పై దాడులు పెంచండి : ఆర్ఆర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
జనసేన ఆధ్వర్యంలో అంబలి ప్రసాదం వితరణ..!
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..
అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్..