వాట్సాప్ లో సైబర్ స్కామ్.. 

By Ravi
On
వాట్సాప్ లో సైబర్ స్కామ్.. 

ఈ డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సరికొత్త పద్దతులతో మోసాలకు పాల్పడుతున్నారు. లింక్స్, మెసెజెస్, కాల్స్ ద్వారానే కాకుండా మరో కొత్త రకం మోసానికి దిగుతున్నారు సైబర్ నేరగాళ్లు. స్కామర్లు వాట్సాప్, ఇతర మెసిజింగ్ యాప్స్ ద్వారా ఫోటోలు పంపించి, ఇందులో స్టెగానోగ్రఫీ అనే టెక్నాలజీతో డేంజరస్ లింక్స్ ని యాడ్ చేస్తారు. ఈ ఫోటోలను మనం డౌన్ లోడ్ చేసుకోగానే.. వారి ఫోన్ క్రాష్ అయ్యేలా ప్లాన్ చేశారు. లేటెస్ట్ గా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్‌కు చెందిన ఒక వ్యక్తికి ఇలాగే, తెలియని నంబర్ నుంచి వాట్సాప్ ద్వారా ఒక ఫోటోను సెండ్ చేయగా.. అతడు ఆ పిక్చర్ డౌన్‌లోడ్ చేసుకోవడంతో సుమారు 2 లక్షల రూపాయలు పోగొట్టుకున్నట్లు పోలీసులు ఫిర్యాదు చేశాడు. 

స్కామర్లు వాట్సాప్ లేదా వేరే మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఫోటోలను పంపడం ద్వారా ఈ మోసం స్టార్ట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో, వాట్సాప్ లో పంపిన ఫోటోలోని వ్యక్తిని గుర్తించమని ఫోన్ కాల్స్ కూడా చేస్తారని సైబర్ నిపుణులు తెలిపింది. ఇక, బాధితుడు ఆ ఫోటోలను డౌన్‌లోడ్ చేసిన తర్వాత, వారి ఫోన్ పూర్తిగా క్రాష్ అవుతుంది. కాబట్టి, పెరుగుతున్న టెక్నాలజీతో స్కామర్లు ఓటీపీ, నకిలీ లింక్స్ కాకుండా.. ఇప్పుడు ఈ ఫోటోలలో లింక్‌లను దాచి పెడుతున్నారని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Latest News

రూ.12 లక్షల గంజాయి స్వాధీనం..! రూ.12 లక్షల గంజాయి స్వాధీనం..!
సికింద్రాబాద్‌ TPN:  సికింద్రాబాద్‌లో ఒకే రోజు రెండు చోట్ల భారీ స్థాయిలో గంజాయిని స్వాధీనం చేసుకోవడంతోపాటు ఒక అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్‌ను రైల్వే పోలీసులు రిమాండ్‌కు తరలించారు....
అఘోరీ కోసం పోలీసులు వేట..!
శ్రీకాళహస్తి టీడీపీ మీడియా కోఆర్డినేటర్‌గా నాగమల్లి దుర్గాప్రసాద్..!
సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..!
సిమెంట్ పరిశ్రమలపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రతాపం..!
బెట్టింగ్ యాప్ భూతానికి మరో యువకుడు బలి..!
ఎన్నికల నియమావళికి అనుగుణంగా విధులు నిర్వహించాలి : అనురాగ్ జయంతి