మీర్పేటలో ఎవరి కోసం ఈ మార్కెట్లు.. అవసరాలు తీర్చని అభివృద్ధి..

By Ravi
On
మీర్పేటలో ఎవరి కోసం ఈ మార్కెట్లు.. అవసరాలు తీర్చని అభివృద్ధి..

  • కంపుకొడుతున్న మీర్పేట్ మున్సిపాలిటీ
  • అభివృద్ధికి నిర్లక్ష్యం చీడ
  •  ప్రజలకు ఉపయోగ పడని రైతు బజార్..మోడల్ మార్కెట్
  • కోట్ల రూపాయల నిధులు వృధా
  • ప్రజలకు అందుబాటులోకి తేవాలని జనం కోరిక

అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉంది అనే సామెతలా ఉంది మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపాలిటీ దుస్థితి. లక్షల్లో ట్యాక్స్ వసూలు చేస్తున్న అభివృద్ధి విషయంలో మాత్రం అణా పైసా కూడా ఖర్చు చేయడం లేదు. అదేమంటే లోటు బడ్జెట్ అంటూ సాకులు చెబుతున్నారని జనం మండిపడుతున్నారు. కాలనీల్లో ఎక్కడి చెత్త అక్కడే.. బస్తీలన్నీ దుర్వాసనతో నిత్యం జనాలను సతమతం చేస్తున్నాయి. లేని సౌకర్యాల మాట సరే... ఉన్నవాటిని అయిన చూస్తారా అంటే అదీ లేదు.. నిర్లక్ష్యం అనే చెద పట్టి మొత్తం పాడుకావాల్సిందే.. కోట్లు ఖర్చు పెట్టి చేసిన పనులన్నీ పాడైపోవాల్సిందే.

బిఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడి ప్రస్తుత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో జనం కోసం మీర్పేట్ లెనిన్ నగర్ ప్రాంతంలో ఓ రైతు బజార్ నిర్మించారు. అలాగే జనాల దాహార్తితీర్చడానికి ఓ ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించారు. అంతేనా బాలాపూర్ చౌరస్తాలో పేద వ్యాపారుల కోసం ఓ మార్కెట్ నిర్మించారు.. లక్షల కోట్లు పెట్టి అభివృద్ధి చేసి వాటి పర్యవేక్షణ మీర్పేట్ మున్సిపల్ అధికారులకు అప్పగించారు. ఇక్కడి వరకు బాగానే వుంది. మొదట్లో రైతు బజార్ జనాలకు అందుబాటులో ఉంది. రాను రాను అక్కడ అపరిశుభ్రత వాతావరణం జనాలకు దూరం అయ్యేలా చేసింది. అంతే ప్రస్తుతం రైతు బజార్ కాస్త మూతబడింది. దాని పక్కనే ఏర్పాటు చేసిన షాపులు ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఓపెన్ కావడానికి నోచు కోలేదు. ఇక ఓవర్ హెడ్ ట్యాంక్ మీర్పేట్ కి ఓ స్థూపంలా మారిపోయింది.

వీటన్నింటిని పక్కన పెడితే బాలాపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన మోడల్ మార్కెట్. అది ఎవరి కోసం కట్టారు.. ఎందుకు కట్టారో జనాలకు అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. నానా హడావిడి చూస్తూ ఏర్పాటు చేసిన మార్కెట్లు అన్ని నిర్లక్ష్యం చీడపట్టి శిథిలావస్థకు చేరుకున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక కాలనిలో మొదలు పెట్టిన ట్రంక్ లైన్ కూడా శుభ్రం చేసి వారు లేక కంపుకొడుతున్నాయని జనం ఆవేదన.

ఇటీవలే లోటు బడ్జెట్ సాకుతో మీర్పేట్ మున్సిపాలిటీలో ట్యాక్స్ లను అధికారులు అమాంతం పెంచేశారు. దీనిపై జనాలు, బీజేపీ బిఆర్ఎస్ పోరాటాలు చేసిన ఫలితం లేదు. కోట్ల రూపాయల ట్యాక్స్ వసూలు చేసి కనీసం అభివృద్ధికి ఒక్క పైసా ఖర్చు చేయడం లేదని స్థానికులు, మీర్పేట వాసులు మండిపడుతున్నారు. ప్రజల కోసం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చేసిన రైతుబజార్, మోడల్ మార్కెట్ అందుబాటులోకి వచ్చేలా చేయాలని కోరుతున్నారు. చీకటి పడితే చాలు ఆయా మార్కెట్ లలో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయని అటు వెళ్లలాంటేనే భయంగా ఉందంటున్నారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వీటిపై మరోసారి దృష్టి సారించాలని కోరుతున్నారు.

Advertisement

Latest News

సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..! సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..!
హైదరాబాద్ TPN : మనీలాండరింగ్‌ ఆరోపణలతో హైదరాబాద్‌లోని సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ఈడీ సోదాలు నిర్వహించింది. మొత్తం నాలుగు చోట్ల సోదాలు నిర్వహించిన ఈడీ.. అక్రమ మార్గాల్లో...
సిమెంట్ పరిశ్రమలపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రతాపం..!
బెట్టింగ్ యాప్ భూతానికి మరో యువకుడు బలి..!
ఎన్నికల నియమావళికి అనుగుణంగా విధులు నిర్వహించాలి : అనురాగ్ జయంతి
ఇద్దరు కొడుకుల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న మహిళ..!
జపాన్‌ పర్యటనలో తొలిరోజే రేవంత్‌ బృందం కీలక ఒప్పందాలు..!
26.7 కేజీల గంజాయి పట్టివేత..!