మంత్రికి తమ సమస్యలు చెప్పుకున్న ప్రవీణ్ కుమార్ రెడ్డి.

By Ravi
On
మంత్రికి తమ సమస్యలు చెప్పుకున్న ప్రవీణ్ కుమార్ రెడ్డి.

తిరుపతి లో మంగళవారం కలెక్టర్ ఆఫీస్ నందు, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు, తిరుపతి జిల్లా ఇన్చార్జ్  అనగాని సత్యప్రసాద్ ను, సత్యవేడు నియోజకవర్గ టిడిపి మండల అధ్యక్షులు కుప్పాని ప్రవీణ్ కుమార్ రెడ్డి, సత్యవేడు నియోజకవర్గం కోఆర్డినేటర్ శ్రీపతి బాబు,  టీడీపీ నాయకుల మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. తమిళనాడుకి సరిహద్దు ప్రాంతముగా, ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన ప్రాంతం కావడంతో, అన్ని విధాలుగా ప్రభుత్వం వారు నియోజకవర్గాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఇసుక ఇబ్బంది ఉండటంతో ప్రభుత్వం వారు చర్యలు చేపట్టి అధికారుల తీసుకోవాలని కోరారు. నాగలాపురంలో భవన నిర్మాణ సమస్యలు ఉండటంతో వెంటనే పరిష్కారం చేయాలని మంత్రిని కోరారు. ఊతుకోట - చెన్నై రోడ్లు సరిగ్గా లేవని వాహనదారులు వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారని మంత్రికి  వారు తెలిపారు. మంత్రి సత్య ప్రసాద్ మాట్లాడుతూ  అధిష్టానంకి  వివరించి సమస్యలు పరిష్కారం చేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి వెంటనే ఆ నియోజకవర్గాలపై అభివృద్ధి బాట వేస్తుందని, సత్యవేడు నియోజకవర్గం కూడా రానున్న రోజుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని మంత్రి సత్యప్రసాద్, టిడిపి నాయకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యవేడు నియోజకవర్గానికి చెందిన మరి కొంతమంది టిడిపి నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Latest News

ఇక్రిశాట్‌లో బోనులో చిక్కిన చిరుత..! ఇక్రిశాట్‌లో బోనులో చిక్కిన చిరుత..!
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌లో సంచరిస్తున్న చిరుతను అటవీశాఖ అధికారులు బంధించారు. వారం రోజుల నుంచి చిరుత సంచరిస్తున్నట్లు అనుమానం రావడంతో.. డ్రోన్‌ కెమెరాలతో చిరుత సంచారాన్ని...
తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ
శరత్ సిటీ మాల్ వెనుక అపార్ట్మెంట్‌లో డ్రగ్స్ పట్టివేత
సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా
నాన్ డ్యూటీ లిక్కర్‌పై దాడులు పెంచండి : ఆర్ఆర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
జనసేన ఆధ్వర్యంలో అంబలి ప్రసాదం వితరణ..!
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..