హనుమ విహారి సోషల్ మీడియా పోస్ట్ వైరల్
తెలుగు క్రికెటర్ హనుమ విహారి రీసెంట్ గా సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. క్రికెట్ రూల్స్ లో మార్పులు చేయాంటూ ఆ పోస్ట్ లో వివరించారు. వాంఖడే వేదికగా ముంబయి టీమ్, బెంగళూరు టీమ్ మధ్య జరిగిన మ్యాచ్ లో బెంగుళూర్ విన్ అయిన సంగతి తెలిసిందే. అయితే మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. కోహ్లీ 67, పటీదార్ 64, జితేశ్ శర్మ 40 నాటౌట్ గా నిలిచారు. అలాగే పడిక్కల్ 37 పరుగులు సాధించారు. 150లోపే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను రజత్‌తో కలిసి జితేశ్ నడిపించారు. కేవలం 19 బంతుల్లోనే 40 పరుగులు చేశాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను ముంబయి బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా వేశాడు.
ఈ ఓవర్‌లో జితేశ్ ఐదో బంతికి సిక్స్ కొట్టాడు. ఎల్బీ కోసం అప్పీలు చేసినా.. అంపైర్ ఔట్ అంటూ అనౌన్స్ చేశారు. ఆ వెంటనే బ్యాటర్లు పరుగు తీశారు. డీఆర్‌ఎస్ తీసుకోగా.. రివ్యూలో నాటౌట్ గా తెలిసింది. అయితే, అప్పటికే బంతి డెడ్‌బాల్ గా అనౌన్స్ చేశారు. రన్ తీసినా దానిని కౌంట్ చేయలేదు. ఒకవేళ అంపైర్ నాటౌట్ ఇచ్చి ఉంటే అప్పుడు పరుగును లెక్కలోకి తీసుకొనేవారు. ఇప్పుడీ మ్యాచ్‌లో ఎఫెక్ట్ చూపించలేదు. అదే సెకండ్ ఇన్నింగ్స్‌లో ఒక్క బంతికి రెండు పరుగులు అవసరమైనప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురై ఉంటే ఏం చేసేవారని, సో ఈ రూల్స్ లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది అంటూ విహారీ పోస్ట్ ను షేర్ చేశారు.