హనుమ విహారి సోషల్ మీడియా పోస్ట్ వైరల్

By Ravi
On
హనుమ విహారి సోషల్ మీడియా పోస్ట్ వైరల్

తెలుగు క్రికెటర్ హనుమ విహారి రీసెంట్ గా సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. క్రికెట్‌ రూల్స్‌ లో మార్పులు చేయాంటూ ఆ పోస్ట్ లో వివరించారు. వాంఖడే వేదికగా ముంబయి టీమ్, బెంగళూరు టీమ్ మధ్య జరిగిన మ్యాచ్ లో బెంగుళూర్ విన్ అయిన సంగతి తెలిసిందే. అయితే మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. కోహ్లీ 67, పటీదార్ 64, జితేశ్ శర్మ 40 నాటౌట్ గా నిలిచారు. అలాగే పడిక్కల్ 37 పరుగులు సాధించారు. 150లోపే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను రజత్‌తో కలిసి జితేశ్‌ నడిపించారు. కేవలం 19 బంతుల్లోనే 40 పరుగులు చేశాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ను ముంబయి బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా వేశాడు. 

ఈ ఓవర్‌లో జితేశ్ ఐదో బంతికి సిక్స్‌ కొట్టాడు. ఎల్బీ కోసం అప్పీలు చేసినా.. అంపైర్‌ ఔట్‌ అంటూ అనౌన్స్ చేశారు. ఆ వెంటనే బ్యాటర్లు పరుగు తీశారు. డీఆర్‌ఎస్‌ తీసుకోగా.. రివ్యూలో నాటౌట్‌ గా తెలిసింది. అయితే, అప్పటికే బంతి డెడ్‌బాల్‌ గా అనౌన్స్ చేశారు. రన్ తీసినా దానిని కౌంట్ చేయలేదు. ఒకవేళ అంపైర్‌ నాటౌట్‌ ఇచ్చి ఉంటే అప్పుడు పరుగును లెక్కలోకి తీసుకొనేవారు. ఇప్పుడీ మ్యాచ్‌లో ఎఫెక్ట్ చూపించలేదు. అదే సెకండ్ ఇన్నింగ్స్‌లో ఒక్క బంతికి రెండు పరుగులు అవసరమైనప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురై ఉంటే ఏం చేసేవారని, సో ఈ రూల్స్ లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది అంటూ విహారీ పోస్ట్ ను షేర్ చేశారు.

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!