కన్నుల పండుగగా జుంటుపల్లి సీతారాముల కల్యాణం..!

By Ravi
On
కన్నుల పండుగగా జుంటుపల్లి సీతారాముల కల్యాణం..!

వికారాబాద్ జిల్లా యాలాల మండల పరిధిలోని జుంటుపల్లిలో సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితులు, బాజాభజంత్రీల మధ్య కొనసాగిన కల్యాణ మహోత్సవం కనుల పండుగగా కొనసాగింది. తాండూరు నియోజకవర్గ ప్రజలు, కొడంగల్, కర్నాటక రాష్ట్రాల నుంచి వేలాదిగా ప్రజలతో పాటు సీతారాముల కల్యాణ మహోత్సవంలో ముఖ్య అతిథిగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిమాట్లాడుతూ... భద్రాచలం తర్వాత రెండో భద్రాచలంగా పిలువబడే జుంటుపల్లిలో రాములోరి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడికి తాండూరు నియోజకవర్గ ప్రజలే కాకుండా వికారాబాద్ జిల్లా పరిసర ప్రాంతాల్లో నుంచి పెద్ద ఎత్తున తరలిరావడం జరుగుతోందని అన్నారు. ప్రజలందరికీ ఆ శ్రీ రాముడి దీవెనలు ఉండాలని, శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags:

Advertisement

Latest News

వరంగల్‌ జాబ్‌ మేళాలో తొక్కిసలాట..! వరంగల్‌ జాబ్‌ మేళాలో తొక్కిసలాట..!
వరంగల్‌లో మంత్రులు సీతక్క, కొండా సురేఖ ప్రారంభించిన జాబ్‌ మేళాలో అపశృతి చోటుచేసుకుంది. స్థానిక ఎమ్‌కే నాయుడు కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో తొక్కిసలాట...
ఉప్పల్ స్టేడియంలో టికెట్ల పంపకంపై విజిలెన్స్ డీజీ ఆరా
కూటమి ప్రభుత్వానిది సుపరిపాలన
సెల్‌ఫోన్స్‌ చోరీ ముఠాలు అరెస్ట్‌
పిల్లలు వ‌ద్ద‌నుకుంటే ఊయ‌ల‌లో వేయండి..!
పెరుమాళ్‌ వెంకన్న మహాకుంభాభిషేకం..!
జ్యోతిరావు పూలే జన్మదినం సందర్భంగా బాలపూర్ చౌరస్తాలో ఘనంగా పలువురు నివాళులు