జాతీయ రహదారిపై ప్రమాదం, లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్:
కడప జిల్లా బద్వేల్ నుండి వస్తున్న BCVR ట్రావెల్స్‌కు చెందిన ఓల్వా బస్సు, కొత్తూరు బైపాస్ జాతీయ రహదారిపై గత రాత్రి ప్రమాదానికి గురైంది. బస్సు, ముందు వెళ్ళిన లారీని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం, లారీ ఒక్కసారిగా బ్రేకులు వేసిన వెంటనే బస్సు డ్రైవర్ అందుకు స్పందించకపోవడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలైనప్పటికీ, బస్సులో ప్రయాణిస్తున్న పది మందికి కూడా గాయాలు జరిగాయి. గాయపడిన వారిని వెంటనే శంషాబాద్ హాస్పిటల్‌కు తరలించారు.
బస్సు క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను పోలీసులు, క్రేన్ మరియు వెల్డింగ్ కట్టర్ల సహాయంతో బస్సు ప్రైమ్ ను తొలగించి బయటకు తీశారు.
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడంతో, పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తూ విచారణ జరిపారు.