గ్రూప్ 1 ఫలితాల్లో గోల్ మాల్ - ఏనుగుల రాకేష్ రెడ్డి
గ్రూప్ 1 పరీక్ష ఫలితాల్లో జరిగిన అవకతవకలపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి, తెలంగాణ భవన్ లో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తెలుగు నేలపై పరీక్ష నిర్వహించి, అత్యధిక తెలుగు మీడియం వాళ్ళు పాల్గొన్న పరీక్షలో తెలుగు మీడియం వాళ్లకు ర్యాంక్ రాకపోవడం లో అత్యర్యం ఏంటి?
ఎందుకంటే? 563 పోస్ట్ లలో GRL ప్రకారం తాప్ 500 లో ఒక్క తెలుగు మీడియం అభ్యర్థి కూడా లేరు. ఇందులో కచ్చితంగా కుట్ర దాగుంది.
46 పరీక్షా కేంద్రాల్లో కేవలం 2 సెంటర్ల లోనే 74 మంది టాపర్లు ఉన్నారు. కొన్ని సెంటర్లలో ఒక్క టాపర్ కూడా లేరు ఎందుకు?
ప్రిలిమ్స్ లో క్వాలిఫై వచ్చిన అభ్యర్థులు పరీక్షలు రాస్తే కొన్ని సెంటర్లలో 10% పాస్ అయితే, ఇంకొన్ని సెంటార్లలో 0.2 % పాస్ అయ్యారు. ఈ అంతరం ఎలా సాధ్యం?
పక్క పక్క రూల్ నంబర్లకు 13 మందికి ఒకే ఫలితాలు ఎలా వస్తాయి. ఇదెలా సాధ్యం అయింది.?
కొందరు అభ్యర్థులకు కొన్ని సబ్జెక్ట్ లలో ఉత్తమ ఫలితాలు వచ్చి, ఇంకొన్ని సబ్జెక్ట్ లలో కేవలం 0, 1, 2, 3 మార్కులే రావడం లో ఆంతర్యం ఏంటి?
వీళ్ళు కాబోయే అధికారులు కాబట్టి అభ్యర్థులు పూర్తిగా రిసెర్చ్ చేసి సమాచారాన్ని పంపడం జరిగింది.
టీజీపీఎస్సీ వారు మార్చ్ 13 న గ్రూప్ 1 వాల్యుయేషన్ పారదర్శకంగా జరుగుతుందని ఒక వెబ్ నోట్ రిలీజ్ చేశారు. కానీ, పరీక్ష ఫలితాలు ఫిబ్రవరి లో వస్తాయని నవంబర్ లోనే కాంగ్రెస్ పార్టీ తన అఫిషియల్ సోషల్ మీడియా ఖాతాలు పోస్ట్ పెట్టారు. ఇదెలా సాధ్యం?
అసలు, కాంగ్రెస్ పార్టీకి టీజీపీఎస్సీ కి ఏం సంబంధం.? ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ విషయాలు కాంగ్రెస్ పార్టీకి ఎలా తెలుస్తుంది.?
రికౌంటింగ్ కు అప్లికేషన్ చేసుకున్న 900 మందికి ఒక్కరికీ మార్కులు పెరగలేదు.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే! రికౌంటింగ్ చేయకముందే ఎస్సీ, బీసీ, ఎస్టి, ఓసీ లలో కేటగిరి వారీగా ఫలితాలు వెల్లడించడంలో అంత్యర్యం ఏంటి?
GRL రాకముందే ఎవరెవరికి ఎన్నో మార్కులు, ఏ హాల్ టికెట్ వాళ్లకు ఎన్ని వస్తున్నాయో తెలిసిపోతుంది. ఆ సమాచారాన్ని టెలిగ్రాం గ్రూప్ లలో ఎలా వస్తుంది స్పష్టం చేయాలి.
దేశంలో యూపీఎస్సీ ఉంది, అనేక రాష్ట్రాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ లు ఉన్నాయ్. కానీ, ఏ రాష్ట్రంలో ప్రిలిమ్స్ లో ఒక హాల్ టికెట్, మెయిన్స్ లో ఇంకొక హాల్ టికెట్ ఇచ్చిన దాఖలాలు లేవు.
టీజీపీఎస్సి మాత్రమే ఇలా రెండు హాల్ టికెట్ లు ఎందుకు ఇస్తుంది? దీనిపై చర్చ జరగాలి.
తమ అనుకున్నవాళ్లను బయట పడేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రతీ దాంట్లో కొన్ని ముందే పక్కన పెట్టుకుంటున్నట్టుందని అనుమానాలు వస్తున్నాయి. దీనిపై లోతైన విచారణ జరగాలి.
గ్రూప్ 1 పరీక్షలో జరిగిన అవకతవకల పై విచారణ జరగాలి. రివాల్యూబేషన్ జరగాలి. లేదంటే మళ్లీ పరీక్ష నిర్వహించాలి.
- తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి నాడు ప్రతీ ఎన్నికల సభలో 2 లక్షల ఉద్యోగాలు టీజీపీఎస్సి ద్వారా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.
- 2 లక్షల ఉద్యోగాలు దేవుడెరుగు 20 వేల పేపర్ లను కూడా సరిగ్గా దిద్ధలేకపోయారు.
- ఈ తెలంగాణ భవిష్యత్, దేశ భవిష్యత్ అయిన గ్రూప్ 1 పరీక్ష ఫలితాలు పూర్తిగా తప్పుల తడకలా మారాయి.
- 563 గ్రూప్ 1 పోస్ట్ లలో GRL ప్రకారం తాప్ 500 లో ఒక్క తెలుగు మీడియం అభ్యర్థి కూడా లేకపోవడం దారుణం.
- దేశభాషలందు తెలుగు లెస్స అని ఆంధ్ర బోజులు శ్రీకృష్ణ దేవరాయలు అంటే, ఈ రేవంత్ రెడ్డి దేశ భాషలందు అసలు తెలుగు లెస్ చేసే కుట్ర చేస్తున్నాడు.
- రేవంత్ రెడ్డి గారు తాను రైతు బిడ్డను అన్నాడు రైతులను బజారుపాలు చేశారు.
- రియల్ ఎస్టేట్ వ్యాపారిని అన్నాడు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్స్ రంగాన్ని కుదేలు చేసిండు.
- నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా అన్నాడు రాష్ట్ర వ్యాప్తంగా 15 నెలల ఆయన పాలనలోనే 2000+ పైగా పాఠశాలలు మూసేసీ కొత్త రికార్డు నమోదు చేశారు.
- నేను తెలుగు మీడియం లో చదువుకున్నా అన్నాడు ఇప్పుడు ఏకంగా గ్రూప్ 1 పరీక్షలో టాప్ 500 లో ఒక్క తెలుగు మీడియం అభ్యర్థి కూడా లేకుండా కుట్ర చేశాడు.
- ఎన్టీఆర్ గారు తెలుగు దేశం పార్టీని స్థాపించి తెలుగు ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేశారు.
- ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జాతీయ స్థాయిలో తెలుగోడి సత్తా చూపి తెలంగాణా యాస కు భాషకు వన్నె తెచ్చి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ ను తెచ్చారు కేసీఆర్ గారు.
- కానీ, తెలుగును కూనీ చేసి, తెలుగును హత్య చేస్తున్న ఘనత రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది.
- అసలు తెలుగులో చదివితే టీజీపీఎస్సీ లో స్థానం లేదని చెప్తే అయిపోద్ది కదా! పరీక్షలకు పిలిచి అవమానించడం దేనికి, తెలుగు మీడియం అభ్యర్థులకు కక్ష్య కట్టినట్టు ఫలితాలు రాకపోవడం ఏంటో అంతుచిక్కడం లేదు.
- 20 వేల మంది గ్రూప్ 1 పరీక్ష రాస్తే 12,200+ ఇంగ్లీష్, 7,300+ పైగా తెలుగు మీడియంలో రాశారు. 40% తెలుగు మీడియంలో పరీక్ష రాశారు. కానీ, టాప్ 500 లో ఒక్క తెలుగు మీడియం బిడ్డ లేడు.
- మాతృ మూర్తిని, మాతృ భూమిని, మాతృ భాషను రేవంత్ రెడ్డి అవమానించాడు.
- తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి తల్లిని అవమానించాడు.
- తెలంగాణ లో ఏం లేదని, పూర్తిగా అప్పులతో దివాలా తీసిందని తెలంగాణ భూమిని అవమానించాడు.
- తెలుగు మీడియంలో చదువుకుంటే ప్రతిభకు స్థానం లేదని ఇప్పుడు తెలుగు భాషను అవమానించాడు.
- ఈయన పాలనలో ఏకంగా పోటీ పరీక్షలకు తెలుగు అకాడమి ప్రామాణికం కాదు వికీపీడియా మాత్రమే ప్రామాణికం అని తెలుగు అకాడమి పుస్తకాన్ని అవమానించాడు.
- తెలుగు అకాడమి, తెలుగు, తెలుగు మీడియం పాఠశాలలు ప్రామాణికం కాదు రేపు రేపు తెలంగాణ నే ప్రామాణికం కాదనే ప్రమాదం ఉంది.
- టీఎస్పీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం గారు చైర్మన్ అవ్వగానే యూపీఎస్సీ చైర్మన్ ను కలిశారు. ఆ స్థాయిలో తీర్చి దిద్దుతామని అన్నారు. అవును మనం యూపీఎస్సీ తో పోటీ పడటం సంతోషం అని చాలా ఆనందించడం జరిగింది.
- కానీ, వారి నేతృత్వంలో తెలుగు మీడియం అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. కానీ, ఎక్కడా కూడా ప్రధాన పత్రికల్లో , మీడియాలో కథనాలో కథనాలు రావడం లేదు. మేధావుల విశ్లేషణలు జరగడం లేదు.
- పక్క పక్క రూల్ నంబర్లకు ఒకే రకమైన రిజల్ట్ రావడం, కొన్ని సెంటర్లకు మాత్రమే ఎక్కువ మార్కులు రావడం పై విచారణ జరగాల్సిందే
- మాములుగా యూపీఎస్సీ లో 50% మార్కులు వస్తె ఐఏఎస్, ఐపీఎస్, లు అవుతారు.
- టీఎస్ పీఎస్సీ లో 900 మార్కులకు 6 సబ్జెక్ట్ లలో పరీక్షలు నిర్వహిస్తే టాప్ 550+ అయితే, యూపీఎస్సీ లో టాపర్ల్ కు, ఇంటర్వ్యూ లకు వెల్లొచ్చిన వాళ్లకు 380, 410 మార్కులు మాత్రమే వచ్చాయి. ఇంత వ్యత్యాసం ఇక్కడి నుండి వచ్చింది.
- 1st, 2nd ఇవాల్యువేశన్ జరిగింది. కానీ, 3 జరగలేదని అభ్యర్థులు అంటున్నారు. కానీ, నాకైతే 2 వ ఇవాల్యుయేషన్ కూడా జరగనట్టే అనిపిస్తుంది.
- 1st ఇవాల్యూయేషన్ 2nd ఇవాల్యూయేషన్ కు 15% వ్యత్యాసం ఉంటేనే 3rd కు వెళ్ళాలి. కానీ, సుమారు 40% తేడా ఉండటం ఏంటో అర్థం కావడం లేదు.
- ప్రతీ సబ్జెక్ట్ లో 6 స్పెషలైజేషన్ లు ఉంటాయి. వాటికి సంబంధించిన ప్రొఫెసర్ల తోనే పేపర్ వాల్యూబేషన్ చేయించాలి. కానీ, వాళ్ళు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నవాళ్ళతో చేయించారు. అక్కడే కచ్చితంగా గోల్ మాల్ జరిగిందని అనుమానాలు వస్తున్నాయి.
- ఆరు గ్యారంటీలు దేవుడెరుగు కానీ ప్రతీ క్యాటగిరిలో కొన్ని పోస్ట్ లు గ్యారెంటీ చేసుకున్నారని స్పష్టంగా అర్ధం అవుతుంది.
- మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారూ, ఉద్యోగాల విషయమై అభ్యర్థుల సమస్యల పై మా నాయకులు ఏదైనా మాట్లాడితే వెంటనే కేసులు పెడుతున్నారు.
- మేం ప్రశ్నిస్తే మాపై కేసులు పెట్టినా పర్వాలేదు. కానీ, ఏళ్లతరబడి తపస్సు చేసి చదువుకున్న విద్యార్థులకు న్యాయం చెయ్యండని కోరుతున్నాం.
- రికౌంటింగ్ అప్లికేషన్ చేస్తే 900 మంది చేస్తే ఒక్కరికీ మార్కులు పెరగలేదు. ఇంతకంటే దారుణం ఉంటుందా?
- రికౌంటింగ్ చేయకముందే, రిజల్ట్ రాకముందే ఎస్సీ, బీసీ, ఎస్టి, ఓసీ లలో కేటగిరి వారీగా ఎవరికెన్ని వచ్చాయని ఎలా డిక్లేర్ చేస్తారు. అంటే రివాల్యుయేషన్ పెట్టుకున్నా పెరగవని చెప్పకనే చెప్పారు. అలాంటప్పుడు రివల్యుయేషన్ చెయ్యడం లో వ్యర్ధమే కదా!?
- యూపీఎస్సీ పరీక్షలు 80 రోజులు పడితే ఆంధ్ర ప్రదేశ్ లో 6 వేల మంది పేపర్ లు దిద్దడానికి 40 రోజులు పడితే, టీడీపీఎస్సీ కి మాత్రం 2 ఇవాల్యూబేషన్ కు 90 రోజులు మాత్రమే పట్టింది. కానీ, ఆ ఫలితాలను వెబ్సైట్ లో ఎక్కించడానికి 40 రోజులు పట్టింది.
- వాల్యువేశన్ కు తక్కువ సమయం పట్టింది కానీ వెబ్సైట్ లో ఎక్కించడానికి మాత్రం ఎక్కువ రోజులు పట్టింది ఎక్కించేతప్పుడు కానీ కొంచం కూడా డౌట్ రాలేదు.
- జీవో 29 మీద గ్రూప్ 1 అభ్యర్థులు కేసులు వేశారు. వాస్తవానికి టీజీ పీఎస్సీ మీద ఉన్నన్ని కేసులు ఈ దేశంలో దీనిపై లేవేమో ఏకంగా అభ్యర్థులే 40 కేసులు వేశారు. ఇంకా కొట్లడుతున్నారు.
- సిఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో రవీంద్రభారతి లో మాట్లాడుతూ ఆ కేసులను తుంగలో తొక్కించా అన్నాడు. అంటే కోర్టులో ఏమైనా అవగాహన ఉందా? ప్రజలకు కోర్టుల పై నమ్మకం సన్నగిల్లెలా చేస్తున్నారు.
- మొన్నటికి మొన్న అసెంబ్లీ సాక్షిగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే ల విషయంలో మాట్లాడుతూ కోర్టు పరిధిలో ఈ అంశం ఉంది అయినప్పటికి నేను మాట్లాడుతున్నా ఎవరెన్ని చేసిన ఉప ఎన్నికలు రావని అన్నారు.
- కోర్టు వరుసగా మొట్టికాయలు వేస్తున్న సిగ్గు రావడం లేదు.
- గ్రూప్ 1 విషయంలో విచారణ జరగాలి. లేదా రివాల్యూబేషన్ జరగాలి. లేదంటే మళ్లీ పరీక్ష నిర్వహించాలి.
- విచారణ కమిటీ వెయ్యాలి. అభ్యర్థులకు సమాధానం చెప్పాలి.
- సిఎం కుర్చీ కాపాడుకోవడం కోసం 41 సార్లు డిల్లీకి వెళ్ళావు, కానీ, కనీసం 40 నిమిషాలు వీళ్ళ సమస్యలపై దృష్టి సారించే సమయం దొరకడం లేదా?
- పొద్దున లేస్తే నన్ను సిఎం గా ఎవరూ గుర్తుపడటం లేదని బాధ పడుతున్నావ్. కాబట్టి, ఒకసారి అశోక్ నగర్ కు వెళితే అక్కడ పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థుల దగ్గరికి వెళ్తే వాళ్ళు గుర్తిస్తారు. గుర్తుండిపోయేలా చేస్తారు.
- సాక్షాత్తు విధ్యాశాఖ మంత్రి మీరే కాబట్టి, ఈ అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని మిమ్మల్నే కోరుతున్నాం.
- లేని పక్షంలో న్యాయ పరంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన రూపంలో గ్రూప్ 1 అభ్యర్థులు ఎలా కోరితే అలాగ భారత రాష్ట్ర సమితి పక్షాన వారి వెంట నిలపడి కొట్లాడుతాం.
- రైతు రుణమాఫీ, లాగచర్ల లో, మూసి, హైడ్రా, మొన్నటికిరికిమొన్న హెచ్ సీ యు లో ప్రజల పక్షనా నిలపడి ప్రజలను గెలిపించినట్టే, గ్రూప్ 1 అభ్యర్థుల విషయంలో కూడా అలాగే విజయ తీరాలకు చేసేదాకా నిలపడి కోట్లాడుతాం.