బిఆర్ఎస్ బహిరంగ సభలో హరీశ్ రావు సంచలన వాఖ్యలు

By Ravi
On
బిఆర్ఎస్ బహిరంగ సభలో హరీశ్ రావు సంచలన వాఖ్యలు

నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ముద్విన్ గ్రామంలో నిరుపేద బిడ్డకు ఇంటిని అందజేసి, ఆ తర్వాత బోయిన్ గుట్టలో మహాత్మాగాంధీ, అంబేద్కర్, సేవాలాల్ మహారాజ్ విగ్రహాలను ఆవిష్కరించిన హరీశ్ రావు

మహాత్మా గాంధీ, అంబేద్కర్, సేవాలాల్ విగ్రహాలను ఒకే రోజు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. గాంధీ గారు శాంతియుత మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం సాధించినట్లు, కేసీఆర్ గారు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది అందుకే కేసీఆర్ గారు 125 అడుగుల అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసారు సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టారు. 

సేవాలాల్ మహరాజ్ ను ఎవ్వరూ పట్టించుకోలేదు ఎస్టీల గురించి ఆలోచించలేదు కేసీఆర్ గారు సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ, ఏకైక నాయకుడు కేసీఆర్ ఎస్టీ పిల్లలు చదువుకోవడానికి పది శాతం రిజర్వేషన్లు ఇచ్చింది కేసీఆర్ బంజారాహిల్స్ లో బంజారాభవన్ కట్టి ఆత్మగౌరవం పెంచింది కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలు చేసి మా తండాలో మా రాజ్యం నినాదాన్ని నిజం చేసిండు  కేసీఆర్ గారు ఇంటింటికి నల్లా పెట్టి స్వచ్చమైన నీరు అందించిండు. అక్కా చెల్లి బిందె పట్టుకొని రోడ్ల మీదకు రాకుండా చేసిండు అన్ని సమస్యలకు పరిష్కారం చూపింది కేసీఆర్.


కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది. మాయ చేసింది. ఏడాదిన్నర రేవంత్ పాలన చూస్తే అంతా సగం సగం ఆగం ఆగం ఒక్క పథకం అమలు కాలేదు, ఏది ప్రజలకు అందలేదు. అసెంబ్లీ బయట అబద్దాలు, అసెంబ్లీలో లోపల అబద్దాలు రేవంత్ రెడ్డి రుణమాఫీ ఏమైందని అడిగితే దేవుళ్ల మీద ఒట్లు వేసి మాట తప్పిండు. గండి మైసమ్మ మాత్రం ఆ ఓట్ల నుంచి తప్పించుకున్నది. పంద్రాగస్టు వరకు అందరికి రుణమాపీ చేస్తానని, దేవుళ్ల మీద ఒట్లు వేసి మాట తప్పిండు.
2లక్షల పైనున్న వారు సీఎం మాటలు నమ్మి బ్యాంకుల్ల పైసలు కట్టారు. నల్లమల్ల అడవుల నుంచి వచ్చినోడివి అయితే నీ నిజాయితీ ఏమైంది పాలమూరు బిడ్డవు అయితే నీ పౌరుషం ఏమైంది
వానాకాలం రైతు బంధు 8వేలు ఎగ్గొట్టిండు, యాసంగిలో నాలుగు వేల కోట్లు ఎగ్గొట్టిండు ఈ రెండు కలిపి రుణమాఫీకి జమచేసి, రుణమాఫీ అయిపోయింది అంటున్నడు కరోనా వచ్చినా కూడా కేసీఆర్ గారు రైతు బంధు ఆపలేదు నెలా నెలా పింఛన్ ఆపలేదు రేవంత్ రెడ్డికి ఏమైంది. కరోనా లేదు, ఇబ్బంది లేదు, ఎందుకు ఇవ్వడం లేదు రైతు బంధు చెప్పింది 49వేల కోట్లు, బడ్జెట్ లో 31వేల కోట్లు అన్నడు, ఇచ్చింది 14, 15వేలు కోట్లు కూడా లేదు.
కేసీఆర్ జిడిపి పెంచితే, రేవంత్ గుండాయిజం పెంచుతున్నడు కేసీఆర్ తలసరి ఆదాయం పెంచితే, ఆయన కుటుంబ ఆదాయం పెంచుకుంటున్నడు. పేదల ఆదాయం మాత్రం పెరగటం లేదు. రేవంత్ పాలన ఎట్లుందంటే, అయితే లూటీ లేదంటే లాటీ లాగా ఉన్నది. ఇక్కడ ఆరు లైన్ల రోడ్డు వేస్తామంటే వద్దని మీరు అంటున్నరు. ఇప్పటికే నాగార్జున సాగర్, శ్రీశైలం హైవేలు ఉన్నయి, మీది నుంచి రీజినల్ రింగు రోడ్డు ఉంది. 1200 ఎకరాలు గుంజుకుంటున్నవు. భూమి పోయినోళ్ల బాధ నీకు అర్థం కావడం లేదా ఫార్మా భూముల పట్టాలు ఇవ్వడం కాదు, ఉన్న భూములు గుంజుతున్నడు. రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరగడం కాదు, మీరు చెప్పినట్లు ఎస్సీ ఎస్టీ భూములకు హక్కులు కల్పించాలని రాహుల్ గాంధీని డిమాండ్ చేస్తున్నాం. పింఛన్లు పెంచింది కేసీఆర్, కల్యాణ లక్ష్మి ఇచ్చింది కేసీఆర్ కేసీఆర్ ఇచ్చే రెండు వేలు రెండు నెలలు ఎగ్గొట్టిండు. ముసలోళ్ల పైసలు తిన్నడు రేవంత్ రెడ్డి దివ్యాంగుల పైసలు తిన్నడు రేవంత్ రెడ్డి 13లక్షల పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు సాయం చేసిండు కేసీఆర్ మిషన్ భగీరథితో ఇంటింటికి నీళ్లు ఇచ్చిండు కేసీఆర్ కిట్టు ఇచ్చిండు మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేసిండు రేవంత్ రెడ్డి వచ్చాక,  బతుకమ్మ చీరెలు బంద్ పెట్టిండు పిల్లల స్కాలర్ షిప్పుల పైసలు ఇవ్వడం లేదు ఉన్నవి బందు పెట్టిండు, కొత్తగ చేసిందేం లేదు ఢిల్లీలో బీసీ బిల్లు పాస్ చేపిస్తా అన్నడు, ఆ మీటింగ్ కు రాహుల్ గాంధీ ముఖం చాటేసిండు  రాహుల్ గాంధీని ఒప్పించని రేవంత్, కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా ఒప్పిస్తావు రేవంత్ రెడ్డి మాట్లాడితే తిట్లు తప్ప ఇంకోటి లేదు ప్రజలకు పనికి వచ్చే మాటలు లేవు ఎస్టీలకు రేవంత్ వచ్చాక మంత్రి పదవి కూడా దొరకలేదు కేసీఆర్ లంబాడీ గౌరవం పెంచిండు, రేవంత్ అవమానించిండు. హెచ్ సీ యూ లో విధ్వంస కాండ చేస్తున్నడు రేవంత్ రెడ్డి ఏ భూములు అమ్ముకుందామా అని చూస్తున్నడు అగ్రికల్చర్ యూనివర్సటీలో భూములు గుంజుకున్నడు ఇప్పుడు హెచ్ సీ యూలో భూములు గుంజుకుంటున్నడు పరిపాలన చేయడానికి ఏం లేదా, ప్రజలకు బాధలు లేవా ఇచ్చిన హామీలు ఏమయ్యాయి నువ్వు పాలమూరు బిడ్డవు అయితే, నల్లమల నుంచి వస్తే దమ్ముంటే గన్ మెన్లు లేకుండా, పోలీసులు లేకుండా ఈ తండాకు రా.  నిజంగా రుణమాఫీ చేస్తే పూలు చల్లుతారు. లేదంటే ప్రజల ఇష్టం రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా. నిరుద్యోగులను గొడ్డును బాదినట్లు బాదుతున్నరు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నరు. 5వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అన్నీ గోబెల్స్ ప్రచారం చేసిండు రేవంత్ రెడ్డి, అట్లనే గద్దెనెక్కిండు కేసీఆర్ ఉన్నపుడు మూడు పువ్వులు ఆరు కాయలు లెక్క ఉండే రియల్ ఎస్టేట్ పడిపోయింది. బండ్లు గుంజుకుపోవుడు, ఫైనాన్స్ బంద్ అయ్యింది.  హైడ్రో పేరుతో పేదల ఇండ్లు కూల్చిండు మూసీ ప్రక్షాళన పేరుతో భయాందోళనకు గురి చేసిండు రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ తిరోగమనం అయ్యింది కూల్చుడు తప్ప కట్టుడు తెల్వదు రేవంత్ రెడ్డికి బిజేపీ వాళ్లను నమ్మి ఎంపీలు గెలిపిస్తే, ఢిల్లీ వాడు, గల్లీ వాడు సున్నా పెట్టారు తెలంగాణకు శ్రీరామ రక్ష మన కేసీఆర్ రేవంత్ రెడ్డి ఒర్రుడు ఎక్కువ, పని తక్కువ కేసీఆర్ మాటలు తక్కువ పని ఎక్కువ, ఎవరు కావాలి యువత, విద్యార్థులు ఆలోచించాలి. తెలంగాణకు ఢిల్లీలో ఉన్న బిజేపీ మోసం చేసింది, గల్లీలో ఉన్న కాంగ్రెస్ మోసం చేసింది. విదేశాల్లో నల్లధనం తెస్తానని, అకౌంట్లలో వేస్తానని మోదీ మోసం చేస్తే, రైతు బంధు ఇవ్వక రేవంత్ మోసం చేసిండు రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ ను ఆశీర్వదించాలి అంబేద్కర్, సేవాలాల్, గాంధీ విగ్రహాలు ఏర్పాటు చేసిన మీకు అభినందనలు. బోయిన్ గుట్ట తండా అందరికీ ఆదర్శం. అనంతరం కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్న పలువురు నాయకులు, కార్యకర్తలకు కండువాలు వేసి పార్టీలోకి స్వాగతించారు.

Tags:

Advertisement

Latest News

సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..! సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..!
హైదరాబాద్ TPN : మనీలాండరింగ్‌ ఆరోపణలతో హైదరాబాద్‌లోని సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ఈడీ సోదాలు నిర్వహించింది. మొత్తం నాలుగు చోట్ల సోదాలు నిర్వహించిన ఈడీ.. అక్రమ మార్గాల్లో...
సిమెంట్ పరిశ్రమలపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రతాపం..!
బెట్టింగ్ యాప్ భూతానికి మరో యువకుడు బలి..!
ఎన్నికల నియమావళికి అనుగుణంగా విధులు నిర్వహించాలి : అనురాగ్ జయంతి
ఇద్దరు కొడుకుల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న మహిళ..!
జపాన్‌ పర్యటనలో తొలిరోజే రేవంత్‌ బృందం కీలక ఒప్పందాలు..!
26.7 కేజీల గంజాయి పట్టివేత..!