దేశంలో హైదరాబాద్  సెంట్రల్ యూనివర్సిటీకి ప్రత్యేక ప్రతిష్టత ఉంది - .ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్

By Ravi
On
దేశంలో హైదరాబాద్  సెంట్రల్ యూనివర్సిటీకి ప్రత్యేక ప్రతిష్టత ఉంది -  .ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్

దేశంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ప్రత్యేక ప్రతిష్టత ఉంది సెంట్రల్ యూనివర్సిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం దమనకాండ తెలంగాణకి మాయనిమచ్చగా ఉంది. తెలంగాణ మొదటి దశ ఉద్యమంలో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పడింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కేంద్రంగా అనేక పోరాటాలు జరిగాయి. భూదందాల నుండి వచ్చిన నాయకుడు ప్రభుత్వాన్ని ఏలుతున్నారు. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో భూదందా చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి సెంట్రల్ యూనివర్సిటీలో లంకె బిందెలు కనపడుతున్నాయి. సెంట్రల్ యూనివర్సిటీ భూముల ద్వారా 30 వేల కోట్ల రూపాయలు దండుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారు. సెంట్రల్ యూనివర్సిటీకి రాష్ట్రపతి ఛాన్సలర్ గా వుంటారు. సెంట్రల్ యూనివర్సిటీ లోపలకు పోలీసులు వెళ్లాలంటే వీసీ పర్మిషన్ కావాలి. పోలీసులను వీసీ ఎట్లా అనుమతించారు సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు నిన్నటి వరకు మీతో తిరిగిన విద్యార్థులు పెయిడ్ బ్యాచ్ విద్యార్థులా...? పొంగులేటి.  ప్రజాస్వామ్యం ఏడవ గ్యారెంటీ అని చెప్పారు రాహుల్ గాంధీ రోహిత్ వేముల కోసం సెంట్రల్ యూనివర్సిటీకి వస్తే బిఆర్ఎస్ ప్రభుత్వం ఎస్కార్ట్ ఇచ్చింది. ఇప్పుడు రాహుల్ గాంధీ సెంట్రల్ యూనివర్సిటీకి ఎందుకు రావడం లేదు. విద్యార్థుల వీపులపై లాఠీ దెబ్బలు కొట్టడం రాజ్యాంగ బద్దం కాదు రాహుల్ గాంధీ విద్యార్థులు రేవంత్ రెడ్డిని నిలదీస్తుంటే సిగ్గు అనిపించడం లేదా...?

బిఆర్ఎస్ హయాంలో నోరు విప్పిన మేధావులు ఇప్పుడు ఎక్కడికి వెళ్లారు...?

కోదండరాం, ఆకునూరి మురళి నిరంతరం ప్రతిపక్షం అన్నారు ఎందుకు  మౌన మునుల్లా మారిపోయారు మూసీ, హైడ్రా పేరుతో ఇళ్ళు కూలగొడుతుంటే కోదండరాం ఎందుకు మాట్లాడలేదు. కోదండరాం ప్రజాస్వామిక స్ఫూర్తిని ఎందుకు మర్చిపోయారు. చరిత్రలో దోషులుగా నిలబడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు. లగచర్లలో గిరిజనుల భూములను లాక్కుంటే ఎందుకు మాట్లాడలేదు. 

కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు ఊపిరి ఆడిందా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడనందుకు ఊపిరి ఆడుతుందా మీ భుజాలపై  రేవంత్ రెడ్డి సిఎం అయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలు విధిస్తే కోదండరామ్ ఎందుకు మాట్లాడలేదు ఆకునూరి మురళికి సెంట్రల్ యూనివర్సిటీలో దళిత,బహుజన  విద్యార్థులపై లాఠీ ఛార్జ్ కనపడటం లేదా మేధావులు మాట్లాడాలని, కొట్లాడాలని సమాజం ఆశిస్తోంది. మీకు కేసీఆర్ పై వ్యక్తిగత కోపమా...? లేక సమాజం పట్ల భాద్యత ఉందా లేదా అనేది తేల్చుకోవాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పక్కన మేధావులు నిలబడుతున్నారు. రేవంత్ రెడ్డికి గోడకట్టి గొడుగు ఎందుకు పడుతున్నారు. సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డికి మొట్టికాయలు వేసింది . రేవంత్ రెడ్డి చేసే దుర్మార్గాలకు మౌనంగా ఉంటే కుమ్మక్కు కావడమే రేవంత్ రెడ్డికి తెలంగాణ పట్ల ప్రేమ లేదు నీళ్లు,నిధులు,నియామకాలు ఉద్యమ ట్యాగ్ లైన్ కాదు అని రేవంత్ రెడ్డి అన్నారు. మేము వెళ్తే బిఆర్ఎస్  పెయిడ్ బ్యాచ్ అని అంటారు. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్.ఎస్.యూ.ఐ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టర్లు వేసింది. ప్రొఫెసర్ హరగోపాల్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రభుత్వం చర్యలను ఖండించారు.

Tags:

Advertisement

Latest News

బూతులతో రెచ్చిపోయిన పికిల్స్ యజమాని అలేఖ్య.. క్లారిటీ ఇచ్చిన చెల్లి రమ్య బూతులతో రెచ్చిపోయిన పికిల్స్ యజమాని అలేఖ్య.. క్లారిటీ ఇచ్చిన చెల్లి రమ్య
కస్టమర్ పై బూతులతో రెచ్చిపోయింది పికిల్స్ యజమాని అలేఖ్య. వాట్సాప్ లో బూతులు తిడుతూ మెసేజ్ లు పంపింది. ఇవి కాస్త వైరల్ కావడంతో సోషల్ మీడియా...
విద్యార్థులకు నాణ్యమైన భోజనం తో పాటు వసతులు కల్పించాలి.
సికింద్రాబాద్ ఎమ్మార్వో కార్యలయంలో రాజీవ్ యువ వికాసం మండల్ లెవెల్ కమిటీ సమావేశం.
హైదరాబాద్​ చేరుకున్న రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ
కొడంగల్ పారిశ్రామిక పార్కు రైతులకు భరోసా
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ ఏఈఈ 
గుండెపోటుతో బీటెక్ విద్యార్థి మృతి