సికింద్రాబాద్ ఎమ్మార్వో కార్యలయంలో రాజీవ్ యువ వికాసం మండల్ లెవెల్ కమిటీ సమావేశం.

By Ravi
On
సికింద్రాబాద్ ఎమ్మార్వో కార్యలయంలో రాజీవ్ యువ వికాసం మండల్ లెవెల్ కమిటీ సమావేశం.

సికింద్రాబాద్ రాజీవ్ యువ వికాసం పథకానికి సంబందించి సికింద్రాబాద్ తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ పాండునాయక్ ఆధ్వర్యంలో వివిద విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. డిప్యూటీ తహసిల్దార్ రజని, జిహెచ్ఎంసి యూసిడి విభాగం ప్రాజెక్ట్ ఆఫీసర్ నీరజ దేవి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెయింట్ జాన్స్ శాఖ మేనేజర్ కృష్ణారెడ్డిలతో పలువురు జీహెచ్ఎంసీ అధికారులతో సమావేశం నిర్వహించారు. కుల, ఆదాయ దృవీకరణ పత్రాల కోసం వచ్చే వారికి 48గంటల్లోగా జారీ చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ మండల్ రెవెన్యూ అధికారి పాండు నాయక్ మాట్లాడుతూ.. సికింద్రాబాద్ మండలానికి సంబందించి 147 బన్సీలాల్ పేటి డివిజన్ పరిధిలోని బోయగూడా కీస్ బ్లాక్ లో ఏర్పాటుచేసిన జిహెచ్ఎంసి వార్డ్ ఆఫీసులో ఆన్లైన్లో రాజు యువ వికాస్ కు సంబంధించి అప్లై చేసిన దరఖాస్తులను స్వీకరిస్తున్నారని, సంప్రదించవలసిన ఫోన్ నెంబర్: 9989998176.
148 రాంగోపాల్పేట్ డివిజన్ పాత కే.ఎఫ్.సి ఆపోజిట్ గల్లీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో జిహెచ్ఎంసి వార్డ్ ఆఫీస్ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారని, సంప్రదించవలసిన ఫోన్ నెంబర్: 9550699964, 149 బేగంపేట్ డివిజన్ పరిధిలోని పాటిగడ్డ లో ఉన్న మోడల్ మార్కెట్లో  జిహెచ్ఎంసి వార్డ్ ఆఫీసులో దరఖాస్తులు స్వీకరిస్తున్నారని, సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ :9550699964, 150 మొండా మార్కెట్ డివిజన్ పరిధిలోని సికింద్రాబాద్ రఫీ ఫైల్ బస్ స్టాప్ ఆపోజిట్ గల్లీలో ఉన్న జిహెచ్ఎంసి వార్డ్ ఆఫీసులో దరఖాస్తులు స్వీకరిస్తున్నారని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్: 9000943222, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధికారులు అందుబాటులో ఉండి దరఖాస్తులు రిజిస్టర్లో నమోదు చేసుకొని స్వీకరిస్తున్నారని తెలిపారు. 
ఇందులో రాజీవ్ యువ వికాసం కోసం ధరఖాస్తు చేసుకున్న వారు అన్లైన్ రసీదుతో పాటు దానికి పొందుపర్చిన పత్రాల జీరాక్స్ కాపీ అందజేయాలన్నారు. ఈ పథకం ద్వారా 50001/- రుణం తీసుకున్న వారికి 100% సబ్సిడీ లభిస్తుందని, 1లక్ష రూపాయలు రుణం తీసుకున్న వారికి 90% శాతం సబ్సిడీ లభిస్తుందని, 2 లక్షల లోపు రుణం తీసుకున్న వారికి 80% సబ్సిడీ లభిస్తుందని, నాలుగు లక్షల లోపు రుణం తీసుకునే వారికి 70% సబ్సిడీ లభిస్తుందని తెలిపారు. ముస్లిం మైనార్టీలు తప్పనిసరిగా తెలంగాణ కుల ధ్రువీకరణ  పత్రంతో ఆన్లైన్లో అప్లై తప్పనిసరి అని తెలిపారు. సమావేశంలో కమ్యూనిటీ ఆర్గనైజర్లు నర్సింహ, దయాకర్, యాదయ్యలు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

అక్రమ ఔషధాలు సీజ్‌..! అక్రమ ఔషధాలు సీజ్‌..!
అక్రమంగా ఔషధాలను నిల్వ చేసి విక్రయిస్తున్నారని వచ్చిన సమాచారం ఆధారంగా తెలంగాణా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పాలిమెల మండలంలో సోదాలు చేశారు....
వ్యక్తిపై బండరాయితో దాడి..!
సిటీలో భారీ డ్రగ్‌ రాకెట్‌ గుట్టురట్టు..!
మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌..!
11 ఏళ్ల బాలికపై వృద్ధుడు లైంగికదాడి..!
వంశధార ప్రాజెక్టును వెంటనే పూర్తిచేయాలి..!
శ్రీరామ్‌ ఫైనాన్స్‌ ఆఫీస్‌లో అగ్ని ప్రమాదం..!