ప్రెస్ క్లబ్ లో జర్నలిస్ట్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అడ్వైజరీ కమిటి సమావేశం

By Ravi
On
ప్రెస్ క్లబ్ లో జర్నలిస్ట్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అడ్వైజరీ కమిటి సమావేశం

WhatsApp Image 2025-03-29 at 6.43.51 PM

హైదరాబాద్:
హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో జె.సి.హెచ్.ఎస్.ఎల్. (JCHSL) అడ్వైజరీ కమిటీ మొదటి సమావేశం విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, సమావేశానికి హాజరైన సభ్యులకు మరియు ప్రత్యేక ఆహ్వానితులకు మేనేజింగ్ కమిటీ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ తొలి సమావేశం విజయవంతంగా జరిగిందని తెలియజేయడానికి మేనేజింగ్ కమిటీ సంతోషాన్ని వ్యక్తం చేసింది.

అడ్వైజరీ కమిటీ సభ్యులు, నాన్-అలాటీ సొంతింటి కలను నెరవేర్చేందుకు, ఈ సంఘం యొక్క లక్ష్యాలను పురస్కరించుకున్నట్లు ప్రకటించారు. “ఈ సమావేశంలో సభ్యులు ఇచ్చిన విలువైన సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకున్నాం. ఈ కమిటీ ఏర్పడినప్పుడు ఎటువంటి లక్ష్యంతో ఏర్పడిందో, అదే దిశగా ముందుకు వెళ్ళిపోతున్నాం,” అని కమిటీ పేర్కొంది.

ఈ రోజు మూడు ప్రతిపాదనలు సమర్పించబడ్డాయి:

  1. గవర్నమెంట్‌తో లాబీయింగ్ చేసి గోపనపల్లిలో మిగిలిన స్థలాన్ని న్యాయస్థానం ద్వారా పొందడం.

  2. ప్రభుత్వ స్థలాన్ని సిటీకి దగ్గరగా అలాట్చించుకోవడం.

  3. సొసైటీ యొక్క ల్యాండ్ పూలింగ్ నిర్వహించడం.

ఈ ప్రతిపాదనలపై సభ్యుల మధ్య చర్చలు జరిగాయి. "ఈ ప్రతిపాదనల్లో అనేక సాధ్యాసాధ్యాలు ఉన్నప్పటికీ, కోర్టు పరిధిలో ఉన్న వాటిపై ప్రస్తుతం ఏమీ కామెంట్ చేయడం లేదు," అని కమిటీ తెలిపింది. మొదటి రెండు ప్రతిపాదనలు, సుప్రీం కోర్టు జడ్జిమెంట్‌తో సంబంధం ఉన్నాయని, దీనిపై లోతుగా చర్చించి, మేనేజింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది.

మూడో ప్రతిపాదనకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సి ఉందని, ఇవి కేవలం సభ్యుల అభిప్రాయాలేనని, త్వరలోనే మేనేజింగ్ కమిటీ మరింత లోతుగా చర్చించి, వచ్చే మీటింగ్‌లో దీనిపై స్పష్టత ఇవ్వాలని హామీ ఇచ్చారు.

అదే సమయంలో, "ఎక్కడ స్థలం సాధించాలన్నా, దానికి ప్రభుత్వం తో సరైన సంబంధాలు, సంప్రదింపులు అవసరమే," అని సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ దిశగా, "ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండే కొద్దిమంది నాన్-అలాటీ జర్నలిస్టులతో సంప్రదింపుల కమిటీ వేయాలని నిర్ణయించాం," అని కమిటీ తెలిపింది.

ఈ సమావేశంలో, ప్రతిపాదనలను పరిశీలించి, త్వరలోనే వాటిపై మరింత లోతుగా చర్చించి, ఓ నిర్ణయానికి రావాలనే లక్ష్యంతో మేనేజింగ్ కమిటీ పని చేస్తామని హామీ ఇచ్చారు.

అంతేకాకుండా, ఈ సమావేశానికి హాజరైన అడ్వైజరీ కమిటీ సభ్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసారు.

Tags:

Advertisement

Latest News

సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..!  సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
సంగారెడ్డి TPN :  బీడీఎల్‌ భానూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాశమైలారం పారిశ్రామివాడలో ఉష కాపర్ వైర్స్ కంపెనీలో పనిచేస్తున్న  కైరత్ మియా అనే సెక్యూరిటీ గార్డుపై గురువారం...
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!
ఉత్తమ లక్ష్యాలతో యువత అభ్యున్నతిని సాధించాలి
స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్రలో పాల్గొన్న- మంత్రి గుమ్మడి సంధ్యారాణి
అగ్నిప్రమాదం బాధితులకు అండగా టిడిపి ఇంచార్జ్ కర్రోతు బంగార్రాజు
మారథాన్‌లో మనుషులతో పాటు రోబోలు..