సనత్ నగర్ మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు

By Ravi
On
సనత్ నగర్ మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు

హైదరాబాద్‌: సనత్‌నగర్ పీఎస్ పరిధిలో జరిగిన సంచలనాత్మక మహిళ హత్య కేసును బాలానగర్ DCP సురేష్ కుమార్ శుక్రవారం ప్రెస్ మీట్‌లో వెల్లడించారు.

ఈ నెల 26 న రాత్రి 10:50 గంటలకు భరత్ నగర్ బ్రిడ్జి సమీపంలోని చికెన్ షాప్ వద్ద ఒక గుర్తు తెలియని మహిళ నగ్నంగా చనిపోయినట్లు షేక్ నయీమ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న సనత్‌నగర్ పోలీసులు, ప్రాథమిక దర్యాప్తులో ఆమె 55 సంవత్సరాల మహిళగా గుర్తించారు.

సీసీ కెమరా విజ్యువల్స్ ఆధారంగా, పోలీసులు నిందితుని జనగాం జిల్లా బచ్చన్నపేట గ్రామానికి చెందిన కొమ్మరాజు కనకరాజు @ రాజు అని గుర్తించి, ఈరోజు ఉదయం బాలానగర్ శోభన బస్ స్టాప్ దగ్గర అరెస్ట్ చేశారు. నిందితుడు గతంలో బాలానగర్ పరిధిలో దొంగతనం కేసులో 6 నెలలు జైలు శిక్ష అనుభవించిన పాత నేరస్థుడిగా ఉన్నాడు.

పోలీసుల విచారణలో, ఇద్దరూ లైంగిక సంబంధం పెట్టుకున్నారని, ఆ సమయంలో మహిళ కేకలు వేయడంతో ఆమెను చంపడానికి పిడికిలితో దెబ్బలు వేసి హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.

బాలానగర్ DCP సురేష్ కుమార్, కేసు 103(1) బిఎన్‌ఎస్‌ సెక్షన్ కింద నమోదు చేసి నిందితుని రిమాండుకు తరలించినట్లు తెలిపారు. మహిళను గుర్తించడానికి ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు.

Tags:

Advertisement

Latest News

మారథాన్‌లో మనుషులతో పాటు రోబోలు.. మారథాన్‌లో మనుషులతో పాటు రోబోలు..
ప్రస్తుతం ప్రపంచం అంతా టెక్నాలజీతో పరుగులు పెడుతుంది. ఇది ప్రజల జీవితాలను ఎంతో ఈజీ చేస్తోంది. ఇప్పటికే వార్తలు చదివే రోబో... హోటళ్లల్లో సర్వ్ చేసే రోబో,...
ప్రతిపక్షాలపై అమెరికా అధ్యక్షుడు ఆగ్రహం..
తీవ్ర విషాదం.. 148 మంది మృతి
ఈ ఏడాది భారత్‌కి వస్తా: ఎలన్ మస్క్
విద్యార్థులకు మద్యం తాగించిన టీచర్‌..
వారిపై సైబర్‌ నేరగాళ్ల పన్నాగం.. కేంద్రం అలర్ట్‌
కుమార్తె పెళ్లిలో డ్యాన్స్‌ చేసిన కేజ్రీవాల్‌..