బెట్టింగ్స్ యాప్స్ కేసులో.. దర్యాప్తుకి సహకరించాలని విష్ణుప్రియకు హైకోర్టు ఆదేశం
By Ravi
On
- బెట్టింగ్ యాప్స్‌పై పంజాగుట్ట, మియాపూర్ పీఎస్‌లలో వేర్వేరు కేసులు నమోదు
- రెండు కేసులను సిట్‌కు బదిలీ చేయనున్నట్లు కోర్టుకు తెలిపిన పీపీ
హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసినందుకు విష్ణుప్రియ పిటీషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. విష్ణుప్రియ తన పిటీషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని, దర్యాప్తుపై స్టే ఇవ్వాలని కోరింది. అయితే, హైకోర్టు దీనిపై నిరాకరించింది.
హైకోర్టు, పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని విష్ణుప్రియకు ఆదేశించింది. అలాగే, చట్టప్రకారం దర్యాప్తు కొనసాగించాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది.
మియాపూర్ పీఎస్ పరిధిలో, బెట్టింగ్ యాప్స్ పై ప్రచారం చేసినందుకు కేసు నమోదు చేశారు. ఫిర్యాదు మేరకు, పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది.
Tags:
Latest News
19 Apr 2025 15:14:21
ప్రస్తుతం ప్రపంచం అంతా టెక్నాలజీతో పరుగులు పెడుతుంది. ఇది ప్రజల జీవితాలను ఎంతో ఈజీ చేస్తోంది. ఇప్పటికే వార్తలు చదివే రోబో... హోటళ్లల్లో సర్వ్ చేసే రోబో,...