స్నేహితుడి కూతురిపై లైంగిక దాడి నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష

By Ravi
On
స్నేహితుడి కూతురిపై లైంగిక దాడి నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష

పహడిషరీఫ్ స్టేషన్ పరిధిలో స్నేహితుడి కూతురి మీద లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి పోక్సో చట్టం ప్రకారం పదేళ్ళ కఠిన కారాగార శిక్ష విధింపు

పహడిషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి తన అనారోగ్య కారణాల వల్ల తాత్కాలికంగా తన కూతురి సంరక్షణను కొన్ని రోజులు అతని స్నేహితుడికి అప్పగించగా, సదరు స్నేహితుడు ద్రోహ బుద్ధితో ఆ బాలికకు మాయ మాటలు చెప్పి, ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి, లైంగిక దాడికి పాల్పడిన సంఘటన Cr.NO 476/2021 కేసులో నిందితుడు సయ్యద్ హాజీ అలీ S/o దివంగత సయ్యద్ మహేద్ అలీ, వయస్సు: 43 సంవత్సరాలు, వృత్తి: ఆటో డ్రైవర్, షహీన్ నగర్, బాలాపూర్, రంగారెడ్డి జిల్లా వాసిని దోషిగా నిర్ధారించడం జరిగింది. పహడిషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో U/S 420,363,376 IPC & section 3&4 ఆఫ్ పోక్సో చట్టం మరియు పహడిషరీఫ్ స్టేషన్ SC NO 614/2022, అత్యాచారం మరియు పోక్సో చట్టం ప్రకారం ఎల్.బి.నగర్‌లోని రంగారెడ్డి జిల్లా గౌరవ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి గారు ఈ రోజు అనగా 04/04/2025 తేదీన నిందితుడిని దోషిగా నిర్ధారించారు. ఈ కేసులో నిందితుడికి పదేళ్ళ కఠిన కారాగార శిక్ష మరియు రూ.15,000/- జరిమానా విధించబడింది* మరియు *బాధితురాలికి రూ.5,00,000/- పరిహారం అందించబడింది.* ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు శ్రీమతి సునీత గారు మరియు డి.రఘు గారు వాదనలు వినిపించారు.

Tags:

Advertisement

Latest News

బారువా బీచ్ ఫెస్టివల్‌ని ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు..! బారువా బీచ్ ఫెస్టివల్‌ని ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు..!
శ్రీకాకుళం TPN : బారువా బీచ్‌లో ఆలివ్ రిడ్లే తాబేలు పిల్లలను సముద్రంలోకి విడుదల చేయడాన్ని చూసే అరుదైన అవకాశం లభించిందని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఆలివ్...
పశ్చిమ్‌బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి : వీహెచ్‌పీ
అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రాకు అభినందనలు..!
తెలంగాణ పోలీసులపై కిడ్నాప్‌ కేసు..!
హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు