న్యాయవాది ఇజ్రాయిల్ చిత్రపటానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి
By Ravi
On
రంగారెడ్డి జిల్లా, 28/03/2025
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామంలో న్యాయవాది ఇజ్రాయిల్ చిత్రపటానికి మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, "న్యాయవ్యవస్థలో పనిచేస్తున్న న్యాయవాదులకే రక్షణ కరువైందని" ఆవేదన వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్ హత్యను ఘాటుగా ఖండిస్తూ, "నిందితునికి కఠిన శిక్షలు పడేవిధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీస్ అధికారులను కోరుతున్నాను" అని అన్నారు.
ఈ సందర్భంగా, సబితా ఇంద్రారెడ్డి ఇజ్రాయిల్ కుటుంబ సభ్యులను పరామర్శించి, "వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని" హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పలువురు ప్రజలు పాల్గొన్నారు.
Tags:
Latest News
18 Apr 2025 14:28:16
హైదరాబాద్ TPN : పశ్చిమ బెంగాల్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్, సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రెడ్డి...