బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఐఈడీని గుర్తించి ధ్వంసం చేసిన CRPF బెటాలియన్

By Ravi
On
బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఐఈడీని గుర్తించి ధ్వంసం చేసిన CRPF బెటాలియన్

చేర్పాల్, గంగాలూరు, బీజాపూర్ జిల్లా
తేదీ: 28/03/2025

బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల కుతంత్రాలను విఫలపరిచింది సీఆర్‌పీఎఫ్ 222 బెటాలియన్ బృందం. 28/03/2025 తేదీన, చేర్పాల్-పాలనార్ మార్గంలో దాదాపు 45 కిలోల ఐఈడీ (ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్) గుర్తించబడింది.

ఈ రోజు ఉదయం 08:00 - 08:30 గంటల మధ్య, చేర్పాల్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో మావోయిస్టులు అమర్చిన ఈ ఐఈడీని సీఆర్‌పీఎఫ్ 222 బెటాలియన్ బృందం గుర్తించి, బీజాపూర్ BDS బృందంతో కలిసి సురక్షితంగా ధ్వంసం చేశారు.

ఈ కార్యక్రమం సురక్షితంగా అమలు చేయడం, భద్రతా బలగాలపై మావోయిస్టులు ప్రతికూల చర్యలు చేపట్టాలని చూస్తున్న సమయంలో, ఈ ఐఈడీ ని తొలగించడం ఒక ప్రముఖ విజయంగా చెప్పవచ్చు.

Tags: