ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్

By Ravi
On
ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వ భూములను కబ్జాలకు పాల్పడుతున్న వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ హెచ్చరించారు. గురువారం, శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లి చెరువు సమీపంలో వెంచర్ స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుపై సదరు ప్రదేశాన్ని సందర్శించిన ఆయన, ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించిన వ్యక్తులపై తక్షణమే ఫిర్యాదు చేసి, తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ, "ప్రభుత్వ స్థలాలపై కబ్జాలు జరిపే వారిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరుగుతుంది. అనంతరం, మా పరిధిలో క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. చెరువులు, కుంటలను ఆక్రమించుకుని వాస్తవంగా ప్రజలకు దుష్పరిణామాలు కలిగించే వ్యక్తులపై తీవ్ర చర్యలు తీసుకుంటాం" అని తెలిపారు.

ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారికి మరింత కఠిన చర్యలు తీసుకోవడం ఇదే సరికొత్త చర్యగా కనిపిస్తోంది.

Tags:

Advertisement

Latest News

పశ్చిమబెంగల్‌లో హిందువులపై హింస ఆమానుషం..! పశ్చిమబెంగల్‌లో హిందువులపై హింస ఆమానుషం..!
హైదరాబాద్ TPN : పశ్చిమ బెంగాల్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్, సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రెడ్డి...
థగ్ లైఫ్ మూవీ కోసం మణిరత్నం, కమల్..
బోరబండలో అడ్డుకంచెతో మహిళల ఇబ్బందులు..!
రూ.12 లక్షల గంజాయి స్వాధీనం..!
అఘోరీ కోసం ప్రొడ్యూసర్ల వేట..!
శ్రీకాళహస్తి టీడీపీ మీడియా కోఆర్డినేటర్‌గా నాగమల్లి దుర్గాప్రసాద్..!
సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..!