సురారంలో హైడ్రా కూల్చివేతలు - ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు
మేడ్చల్ జిల్లా :
సూరారం లో పట్టా కలిగిన మా భూములలో కనీస సమాచారం లేకుండా ఉదయము 7గంటల ప్రాంతంలో వచ్చి ప్రహారి గోడను కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులంటూ మండిపడుతున్నారు సూరారం గ్రామానికి చెందిన కొందరు స్థానికులు.
సర్వే నం.16/28 లోని ప్రైవేట్ భూమిని,ప్రభుత్వ భూమి అంటూ 2009లో నిర్మించిన ప్రహారీ గోడను కూల్చి వేశారు అంటూ ఆరోపించారు.
వారాల రాజేశ్వర్ రావ్ అనే పేరుపై ఉన్న భూమిని... ప్రభుత్వ భూమి గా చూపిస్తూ అందులో నిర్మించిన ప్రహారీ గోడను కూల్చివేశారనీ,కనీస సమాచారం లేకుండా మా ప్రహారీ ఎందుకు కూలుస్తున్నారని అడిగితే పోలీస్ స్టేషన్ కు తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కనీస అవగాహన లేకుండా హైడ్రా,అధికారులు కూల్చివేతలు చేయడం ఏంటని ప్రశ్నించారు.
అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని,న్యాయస్థానం కు వెళ్తామన్నారు సదరు భూమి యజమానులు.
బైట్:వారాల వినోద్,స్థానికుడు