అరసవల్లి ఆలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్.
శ్రీకాకుళం అరసవల్లి శ్రీ సూర్య నారాయణ స్వామీ వారి ఆలయంలో ఆక్టోపస్ కమాండో లు మాక్ డ్రిల్ నిర్వహించారు. సాధారణంగా ఆలయంలో స్వామివారి దర్శనం నిమిత్తం భక్తులు, ప్రముఖులు విచ్చేసిన సందర్భంలో అనుకోకుండా అత్యవసర పరిస్థితుల్లోనూ, ఉగ్రవాదులు దాడులు, ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు భక్తులు, ప్రముఖులు ,ప్రజలు ఏ విధంగా ప్రతిస్పందించాలని విషయంపై వారిని రక్షించే చర్యలో భాగంగా స్పష్టమైన అవగాహన కోసం ముఖ్యమైన ఆలయాల్లో ఈ మాక్ డ్రిల్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో మంగళవారం ఎలైట్ కమాండో ఫోర్స్ ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ (ఆక్టోపస్) కౌంటర్ టెర్రరిస్ట్ మరియు సేఫ్టీ మాక్ డ్రిల్ నిర్వహించింది. సాధారణంగా ప్రజలకు ఆలయం మూసివేయబడిన తర్వాత రాత్రి సమయంలో ఆలయ,పోలీసు, ఫైర్ అధికారులు,సిబ్బంది సమన్వయం తో కౌంటర్ టెర్రరిస్ట్ మాక్ డ్రిల్ నిర్వహించారు.ఈ మాక్ డ్రిల్ లక్ష్యం, ఆలయంలో ఏదైనా ఉగ్రవాద దాడి లాంటి దాడి లేదా అవాంఛనీయ సంఘటనలపై ప్రతి దాడిని నిర్వహించడం.భక్తులను మరియు ఆలయ మౌలిక సదుపాయాలను రక్షించడం ఈ మాక్ డ్రిల్ నిర్వహించడం యొక్క లక్ష్యం. ముందుగా, దీనిపై సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు, ఆక్టోపస్ అదనపు ఎస్పీ రాజా రెడీ ఆధ్వర్యంలో అక్టోఫస్ స్వాట్ సిబ్బంది సుమారు 40 మంది పాల్గొన్నారు.ఆలయ, పోలీస్ అధికారులు ఈ మాక్ డ్రిల్‌ను పర్యవేక్షించారు. ఆలయంలో భద్రత ,భద్రతా చర్యలను పెంచడానికి, అత్యవసర సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పై ఆక్టోపస్ వారు సూచనలు చేశారు.
ఈ మాక్ డ్రిల్ కార్యక్రమంలో
అదనపు ఎస్పీ రాజారెడ్డి, డీఎస్పీలు మదుసుధన్ రావు, జగ్గు నాయడు, శ్రీకాకుళం రూరల్, ఎస్బి ఇనస్పెక్టర్లు, పైడిపు నాయడు, ఇమ్మన్యూల్ రాజు,వర ప్రసాద్ , ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.