గొల్లప్రోలు నగర పంచాయతీ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికుల ధర్నా

By Ravi
On
గొల్లప్రోలు నగర పంచాయతీ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికుల ధర్నా

 

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు నగర పంచాయతీ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు.

ఈ ధర్నా సందర్భంగా సిఐటియు నాయకులు కే. చిన్నా నందీశ్వరరావు మాట్లాడుతూ, శానిటేషన్ కార్మికులకు పని చేయడానికి అవసరమైన సామాన్లు అందించాలని, గత కమిషనర్ వారికి కూడా ఇదే అభ్యర్థన చేసినట్లు తెలిపారు. సబ్బులు, బ్లౌజులు, నూనె, యూనిఫామ్, చీపుర్లు, ఇనుప చక్రాల బళ్ళు, మరమ్మత్తుల సదుపాయాలు ఇలాంటి పరిష్కారాలు కూడా కార్మికులకు అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ఇక, పనిచేసే కార్మికుల పట్ల తీవ్ర ఒత్తిడి ఉన్నదని, జనాభా ఆధారంగా సిబ్బందిని పెంచాలని, కంటి పరీక్ష మస్తరు విధానాన్ని రద్దు చేసి పాత పుస్తకాల విధానాన్ని కొనసాగించాలని ఆయన అన్నారు.

మరోపక్క, 4 సంవత్సరాల క్రితం బంగారు రాము అనే కార్మికుడు చనిపోయిన సంగతి గుర్తుచేస్తూ, అతనికి గత ప్రభుత్వం ప్రకటించిన రూ. 2 లక్షల సహాయం ఇప్పటివరకు అందలేదని తెలిపారు. అలాగే, కోవిడ్ సమయంలో పనిచేసిన 8 మందికి జీతాలు చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

నియామకాలకు సంబంధించిన ఇతర డిమాండ్లను కూడా వారు సమర్పించారు. సెక్రటరీలు ఉన్నప్పటికీ, మేస్త్రిలను పనిచేయించి, శానిటేషన్ వర్కర్లుగా నియమించాలనీ, తదితర సమస్యలను పరిష్కరించాలనీ వారు అంగీకరించారు.

ధర్నా అనంతరం నగర పంచాయతీ మేనేజర్ వారికి వినతిపత్రం ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు: వర్కర్స్ ఎన్. ఏసమ్మ, సిహెచ్., వి. రమణ, రామారావు, రాజు, రాజమోహన్, లోవరాజు, సత్యవతి, దివ్యవాణి, సింహాచలం, పైడిరాజు, చిన్ని, బి. లో. కుమారి, వెంకటేశు, తదితరులు.

Tags:

Advertisement

Latest News

తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయంలో అవినీతి...
శరత్ సిటీ మాల్ వెనుక అపార్ట్మెంట్‌లో డ్రగ్స్ పట్టివేత
సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా
నాన్ డ్యూటీ లిక్కర్‌పై దాడులు పెంచండి : ఆర్ఆర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
జనసేన ఆధ్వర్యంలో అంబలి ప్రసాదం వితరణ..!
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..
అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్..