ప్రియురాలు అప్సర కేసులో పూజారి వెంకట సాయికి జీవితఖైదు
By Ravi
On
హైదరాబాద్:
సరూర్ నగర్ లో జరిగిన అప్సర హత్య కేసులో, పూజారి వెంకట సాయి సూర్య కృష్ణను కోర్టు జీవిత ఖైదు విధించింది. అలాగే, సాక్ష్యాలను తారుమారు చేసినందుకు అతనికి 7 ఏళ్ల జైలు శిక్ష కూడా విధించారు.
పూజారి వెంకట సాయి సూర్య కృష్ణ, అప్సరను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే, పెళ్లి చేసుకోమని అప్సర అడగడంతో, 2023లో అతను ఆమెను కారులో తీసుకెళ్లి హత్య చేసి, ఆమె మృతదేహాన్ని సరూర్ నగర్ లోని ఒక సెప్టిక్ ట్యాంక్‌లో పూడ్చివేశాడు.
ఈ ఘటనపై పోలీసులు తీవ్ర దర్యాప్తు నిర్వహించారు, పూజారి సాయి సూర్య కృష్ణ పై చేసిన అఘాయిత్యాన్ని వెలికితీయడంలో విజయవంతమైన పోలీసులు, కోర్టు తీర్పు ఆధారంగా అతన్ని శిక్షించారు.
Tags:
Latest News
18 Apr 2025 10:55:39
సికింద్రాబాద్ TPN:
సికింద్రాబాద్‌లో ఒకే రోజు రెండు చోట్ల భారీ స్థాయిలో గంజాయిని స్వాధీనం చేసుకోవడంతోపాటు ఒక అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్‌ను రైల్వే పోలీసులు రిమాండ్‌కు తరలించారు....