ఎంఎంటీఎస్ ఘటనలో కొనసాగుతున్న దర్యాప్తు

నిందితుడి కోసం నాలుగు బృందాలుగా గాలింపు

By Ravi
On
ఎంఎంటీఎస్ ఘటనలో కొనసాగుతున్న దర్యాప్తు

 

హైదరాబాద్, 24 మార్చి 2025: ఎంఎంటీఎస్ ట్రైన్‌లో యువతి పై లైంగిక దాడి ప్రయత్నం చేసిన నిందితుడు జంగం మహేశ్ ను పోలీసులు గుర్తించగలిగారు. మేడ్చల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన జంగం మహేశ్ ఫోటో ఆధారంగా బాధితురాలు ఆయనపై లైంగిక దాడి ప్రయత్నం చేశాడని గుర్తించింది.

పోలీసుల వివరాల ప్రకారం, మహేశ్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. అతని ఫోటోను బాధితురాలికి చూపించడంతో ఆమె మహేశ్ ను గుర్తించింది. మహేశ్ గతంలో గంజాయికి బానిస అయి పాత నేరస్తుడు అని కూడా పోలీసులు పేర్కొన్నారు.

నిందితుడి కోసం నాలుగు బృందాలుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు సీసీ ఫుటేజ్ పరిశీలిస్తూ, జంగం మహేశ్ను పోలీసులు గాలిస్తున్నారు.

మహేశ్, ఏడాది క్రితం తన భార్యను వదిలేసిన వ్యక్తి కాగా, తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఒంటరిగా జీవించేవాడు.

సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు మహేశ్ ను పట్టుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలికి ఈ సంఘటనపై విచారణ కొనసాగుతోంది.

Tags:

Advertisement

Latest News