దేశ‌వ్యాప్తంగా నిలిచిపోయిన యూపీఐ పేమెంట్స్‌

By Ravi
On
దేశ‌వ్యాప్తంగా నిలిచిపోయిన యూపీఐ పేమెంట్స్‌

డిజిట‌ల్ పేమెంట్ స‌ర్వీసులు వచ్చిన తర్వాత పేమెంట్స్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. కాగా ఉద‌యం నుంచి యూపీఐ పేమెంట్స్ స‌రిగా జ‌ర‌గ‌డం లేదు. యునిఫైడ్ పేమెంట్స్ ఇంట‌ర్‌ఫేస్ సిస్ట‌మ్ స్టో అయిన నేప‌థ్యంలో.. ఆన్‌లైన్ క‌స్ట‌మ‌ర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్‌, హాస్పిట‌ల్స్‌, హోట‌ల్స్ దగ్గర.. యూపీఐ పేమెంట్స్ నిలిచిపోయాయి. ఒక‌వేళ పేమెంట్ చేసినా ఎర్ర‌ర్ అని లేదా పెండింగ్ అని చూపిస్తున్నాయి. దేశ‌వ్యాప్తంగా యూపీఐ స‌మ‌స్య‌లు వ‌స్తున్న‌ట్లు.. సోష‌ల్ మీడియా యూజ‌ర్ల ద్వారా స్ప‌ష్ట‌మ‌వుతోంది. 

దీంతో బిల్ పేమెంట్స్ ద‌గ్గ‌ర స‌మ‌స్య రావ‌డంతో అంద‌రూ క్యాష్ అడుగుతున్నారు. దీంతో కొంద‌రు క‌స్ట‌మ‌ర్లు వెనుదిరిగి పోవాల్సి వ‌స్తోంది. డౌన్‌డిటెక్ట‌ర్ వెబ్‌సైట్ ద్వారా యూఐపీ పేమెంట్ స‌మ‌స్య‌లు బయటపడ్డాయి. ఆ వెబ్‌సైట్ ప్ర‌కారం ఇవాళ మ‌ధ్యాహ్నం వేళ పేమెంట్స్ స‌మ‌స్య‌లు తీవ్రంగా వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. పేమెంట్స్ చేయ‌డంలో సుమారు 66 శాతం మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 34 శాతం మందికి ఫండ్స్ ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డం క‌ష్టంగా మారింది.

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!