అంగరంగ వైభవంగా జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి దంపతుల వివాహ రజితోత్స వేడుకలు
హాజరై శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూటమి నాయకులు
కాకినాడ జిల్లా జగ్గంపేట, గండేపల్లి మార్చి 22: స్థానిక పరిణయ ఫంక్షన్ హాల్ లో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి దంపతుల 25వ పెళ్లిరోజు సందర్భంగా జ్యోతుల నవీన్ తనయుడు అనీష్ నెహ్రూ అంగరంగ వైభవంగా నవీన్ లక్ష్మీదేవి దంపతుల వివాహ రజతోత్స వేడుకలు నిర్వహించారు. ముందుగా జగ్గంపేట నవీన్ ఇంటివద్ద అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రతం నోచుకుని పరిణయ ఫంక్షన్ హాల్ కు చేరుకున్నారు. నవీన్ తల్లిదండ్రులు జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ మణి దంపతులు నవీన్ లక్ష్మీదేవి లకు దండలు మార్పించి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందించారు. జ్యోతుల నవీన్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఎమ్మెల్సీ పే రాబత్తుల రాజశేఖర్, అనంత ఉదయ భాస్కర్, కూడా చైర్మన్ తుమ్మల బాబు, మాజీ ఎంపీ గిరిజాల వెంకటస్వామి నాయుడు, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, ఎస్ వి ఎస్ ఎన్ వర్మ, పర్వత బాపనమ్మ, గన్ని కృష్ణ ,రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారు శ్రీరామ్ సత్యనారాయణ, నిమ్మకాయల రంగనాథ్, జక్కంపూడి గణేష్, వరుపుల తమ్మయ్య బాబు, తుమ్మలపల్లి రమేష్, నాలుగు మండలాల అధికారులు, కుటమి నాయకులు, వేలాదిగా కార్యకర్తలు పాల్గొన్నారు.