మత్స్యకారుల సమస్యల కోసం కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ని కలిసిన కేంద్ర మంత్రి రామ్మోహన నాయుడు.

By Ravi
On
 మత్స్యకారుల సమస్యల కోసం కేంద్ర మంత్రి  సర్బానంద సోనోవాల్ని కలిసిన కేంద్ర మంత్రి  రామ్మోహన నాయుడు.

శ్రీకాకుళం జిల్లా 11/10/25

శ్రీకాకుళంలో మత్స్యకారుల కోసం సముద్ర మౌలిక సదుపాయాల అవసరం గురించి గౌరవనీయులైన కేంద్ర పోర్ట్స్ , షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ గారిని కలిసాము. సుమారు 150 కిలోమీటర్ల తీరప్రాంతం ఉన్నప్పటికీ, సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల ఈ ప్రాంతం నుండి చాలా మంది మత్స్యకారులు జీవనోపాధి కోసం పశ్చిమ తీరప్రాంత రాష్ట్రాలైన గుజరాత్, కేరళ మరియు కర్ణాటకకు వలస వెళ్ళవలసి పరిస్థితులను వివరించాము.

ఈ దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించడం కోసం,  సంతబొమ్మలి మండలంలోని భావనపాడు గ్రామంలో ఒక ఫిషింగ్ హార్బర్‌ను నిర్మించాలని, వజ్రపుకోత్తూరు మండలంలోని మంచినీళ్లుపేట మరియు గారా మండలంలోని కళింగపట్నంలో ఫిషింగ్ జెట్టీలను నిర్మించాలని కోరాము.ఈ ప్రాజెక్టులు వల్ల స్థానిక ఉపాధి అవకాశాలను సృష్టించడంతో పాటు వలసలను తగ్గించడంలో మరియు తీరప్రాంత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సానుకూలంగా స్పందించిన శ్రీ సర్బానంద సోనోవాల్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.  అని ఒక ప్రకటనలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.

 

Tags:

Advertisement

Latest News

20వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు 20వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
ఒక ఉద్యోగికి రీపోస్టింగ్‌ ఇవ్వడానికి రూ.20 డిమాండ్‌ చేసి ఆ మొత్తాన్ని సీసీ ద్వారా తీసుకుంటుడగా డీఎంహెచ్‌వోను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు ఇచ్చిన...
శ్రీకాకుళం రూరల్ లో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే గొండు శంకర్ సమీక్ష
సామాన్యులు నష్టపోకుండా చూసే బాధ్యత నాది హామీ ఇచ్చిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ 
ఎంబిబిఎస్ పట్టాదారులు ప్రభుత్వ సేవలో చేరాలి - మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
కేటీఆర్ కు బల్మూర్ వెంకట్ కౌంటర్
బి.ఆర్.ఎస్ రజతోత్సవ పాటను  ఆవిష్కరించిన పార్టీ అధినేత కేసీఆర్ 
సన్న బియ్యం పథకం - పేదల ఆత్మగౌరవ పథకం