ల‌క్ష‌లాది ఎక‌రాల్లో చెట్ల‌ను న‌రికిన చ‌రిత్ర బీఆర్ఎస్‌ది కాదా? - మంత్రి శ్రీ డి.శ్రీధర్ బాబు

By Ravi
On
ల‌క్ష‌లాది ఎక‌రాల్లో చెట్ల‌ను న‌రికిన చ‌రిత్ర బీఆర్ఎస్‌ది కాదా? - మంత్రి శ్రీ డి.శ్రీధర్ బాబు

  • హెచ్ సి యూ భూముల‌పై బీఆర్ఎస్ వ్య‌వ‌హారం ద‌య్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్లుగా ఉంది.
  • నాడు కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిందేమిటి? -నేడు కేటీఆర్ మాట్లాడుతుందేమిటి?
  • ­ఫేక్ ఫోటోలు, వీడియోల‌తో విద్యార్ధుల‌ను రెచ్చ‌గొట్టే చ‌ర్య‌లు మానుకొండి.
  • పారిశ్రామిక ప్ర‌గ‌తికి స‌హ‌క‌రించండి.
  • సీఎం ని వ్యక్తిగతంగా దూషించడం సరికాదు.

అధికారంలోకి వ‌స్తే హెచ్‌సియూ భూముల‌ను కాపాడ‌తామంటూ బీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు హాస్యాస్ప‌దమని ఐ.టి., పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ డి.శ్రీధర్ బాబు అన్నారు. ఈ ప్ర‌భుత్వం హెచ్‌సియూ భూముల జోలికి వెళ్ల‌డం లేదని, హెచ్‌సియూకు చెందిన అంగుళం భూమిని కూడా ఈ ప్ర‌భుత్వం తీసుకోవ‌డం లేదని గురువారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలలో స్పష్టం చేశారు. హెచ్‌సియూ సంబంధం లేని భూముల‌ విషయంలో విద్యార్ధుల‌ను రెచ్చ‌గొడుతున్నారు. విద్యార్ధుల‌ను పావులుగా వాడుకుంటున్నారు. ఫేక్ ఫోటోలు, వీడియోల‌తో సోషల్ మీడియా ద్వారా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ విద్యార్ధుల‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. రెచ్చ‌గొట్టే చ‌ర్య‌లను మానుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులకు హితవు పలికారు. 

పారిశ్రామిక అభివృద్ధి చేసి, ఉపాధి అవకాశాలను పెంచాలన్న తపనతో, లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తుండగా ఆయనపై కేటిఆర్ గారు వ్యక్తిగతం దూషణలకు దిగడం సరైన చర్య కాదు. ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలను వెనకకు  తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము.

ఫేక్ ప్ర‌చారాల‌తో పారిశ్రామిక అభివృద్దిని అడ్డుకోవ‌డం ద్వారా రాష్ట్ర యువ‌తీ యువ‌కుల‌కు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాకుండా చేసే కుటిల కుట్ర‌ల‌ను మానుకోవాల‌న్నారు.

కంచె గ‌చ్చిబౌలిలోని 400 ఎక‌రాల‌కు, హెచ్ సి యూకు ఎలాంటి సంబంధం లేదు. ఆ 400 ఎక‌రాల భూమిపై స‌ర్వ‌హ‌క్కులూ ఈ ప్ర‌భుత్వానివే. ఈమేర‌కు హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా స్ప‌ష్టం చేశాయి. 

కంచె గ‌చ్చిబౌలి భూముల‌ను ఆనాటి టీడీపీ ప్ర‌భుత్వం ఒక ప్రైవేటు కంపెనీకి ధార‌ద‌త్తం చేస్తే దానిని ర‌ద్దు చేసింది కాంగ్రెస్ ప్ర‌భుత్వం.ఆ త‌ర్వాత ఆ భూముల‌ను కాపాడింది ఈ కాంగ్రెస్ ప్ర‌భుత్వమే!

బీఆర్ఎస్ ప‌దేండ్ల పాల‌న‌లో ఈ భూముల గురించి ఎందుకు నోరు మెద‌ప‌లేదు. ఎందుకు ప‌ట్టించుకోలేదు. ఈ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఉన్న భూముల‌ను అప్ప‌నంగా బినామీల‌కు క‌ట్ట‌బెట్టిన బి ఆర్ ఎస్ నాయ‌కులు ఈ రోజు మాట్లాడుతుంటే .. ద‌య్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్లుగా ఉంది. 

మూడేళ్ల త‌ర్వాత అధికారంలోకి వచ్చి కంచె గ‌చ్చిబౌలి భూముల‌ను వెన‌క‌కు తీసుకుంటామ‌ని, ఎకో పార్క్ ఏర్పాటు చేస్తామ‌ని ప‌దేండ్లు అధికారంలో ఉన్న నాయ‌కులు ఈ రోజు మ‌తిలేని మాట‌లు మాట్లాడుతున్నారు. మూడు సంవత్స‌రాల త‌ర్వాత అధికారంలోకి వ‌స్తామ‌ని మేక‌పోతు గాంభీర్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. 

2014-2023 వరకు 4,28,437 ఎకరాల అటవీ భూమిని మాయం చేశారు.

 ప్ర‌జ‌ల‌కు ఏమాత్రం ఉప‌యోగ‌ప‌డ‌ని, కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ కోసం 7,829 ఎక‌రాల అట‌వీభూముల‌ను సేకరించారు. ప్రాజెక్టుల పేరుతో అటవీ భూములను స‌ర్వ‌నాశ‌నం చేసిన బీఆర్ఎస్ ప్ర‌బుద్ధులు ఈ రోజు ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ గురించి మాట్లాడుతున్నారు. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ గురించి మాట్లాడే నైతిక హ‌క్కు వారికి ఎక్క‌డిది?

అభివృద్ధి పేరుతో పర్యావరణ విధ్వంసానికి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పాల్పడింది.

ఆనాడు వ‌రంగ‌ల్‌లో బీఆర్ఎస్ పార్టీ బ‌హిరంగ‌స‌భ కోసం వేలాది చెట్ల‌ను నేల‌కూల్చిన చ‌రిత్ర వారిది కాదా?

ఫారెస్ట్ క‌న్స‌ర్వేష‌న్ యాక్ట్ (ఎఫ్ సి ఎ) కు విరుద్ధంగా 2016 - 19 వ‌ర‌కు తెలంగాణ‌లో 12,12,753 చెట్ల‌ను తొలిగించార‌ని ఇటీవ‌ల పార్ల‌మెంట్‌లో ఒక ఎంపీకి ఇచ్చిన లిఖిత పూర్వ‌క స‌మాధానంలో కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. 

దేశంలో చెట్ల‌ను న‌రికేసిన రాష్ట్రాల‌లో టాప్ -3 లో తెలంగాణ ఉంది. మీ చ‌రిత్ర ఇలా పెట్టుకొని ఈ రోజు నీతులు చెబుతున్నారు. 

28 ఎక‌రాల విస్తీర్ణంలో మ‌రో 50 ఏండ్ల‌పాటు ప‌నికివ‌చ్చే పెద్ద‌పెద్ద భ‌వ‌నాల‌ను కూల్చ‌డ‌మేకాకుండా, వందేళ్ల చ‌రిత్ర క‌లిగిన దాదాపు వెయ్యి చెట్ల‌ను న‌రికి న‌యా స‌చివాల‌యాన్ని నిర్మించిన నాయ‌కులు ప‌ర్యావ‌ర‌ణం గురించి మాట్లాడుతున్నారు. 

ఉన్న‌వి లేన‌ట్లుగా, లేనివి ఉన్న‌ట్లుగా ఫేక్ ఇమేజ్ ల‌ను, వీడియోల‌ను సృష్టించి బీఆర్ఎస్ సోష‌ల్ మీడియా ద్వారా విద్యార్ధుల‌ను రెచ్చ‌గొట్టి త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. ప్ర‌శాంతంగా ఉన్న న‌గ‌రంలో చిచ్చుపెట్టే కుట్ర‌ల‌కు తెర‌లేపుతున్నారు. 

దాదాపు 25 సంవ‌త్స‌రాల నుంచి నిరుప‌యోగంగా ఉన్న ఆ 400 ఎక‌రాల‌లో కొన్ని పిచ్చిమొక్క‌లు మొలిచాయి. కానీ బి ఆర్ ఎస్ ఫేక్ వీడియోల‌తో ప్ర‌చారం చేస్తున్న‌ట్లుగా అక్క‌డ ఏమీ లేదు. 

111 జీవోను ఎత్తివేసి హైద‌రాబాద్ ప్ర‌జ‌ల దాహార్తిని తీర్చే హిమాయ‌త్ సాగ‌ర్, గండిపేట ల‌క్ష‌లాది ఎక‌రాల ప‌రివాహ‌క ప్రాంతం మొత్తాన్ని స‌ర్వ‌నాశ‌నం చేసిన చ‌రిత్ర బి ఆర్ ఎస్ ది కాదా?

ప్ర‌గ‌తి నిరోధ‌క విధానాల‌ను మార్చుకొని ప్ర‌జ‌ల అభిమ‌తానికి అనుగుణంగా మ‌స‌లుకొండి. 

హెచ్ సి యూ భూముల విష‌యంలో ఆనాడు కేసీఆర్ గారు శాస‌న‌స‌భ‌లో మాట్లాడిన విష‌యాన్ని ఆ పార్టీ నాయ‌కులు ఒక సారి గుర్తుకు తెచ్చుకొని మాట్లాడాలని సూచించారు.

ఉస్మానియా యునివర్సిటి భూముల్లో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టాలని ఆలోచన చేసింది. విద్యార్థులు ప్రతిఘటించడంతో వెనకకు తగ్గింది. ఈరోజు మాత్రం హెచ్ సీ యు కు ఎలాంటి సంబంధం లేని భూముల గురించి మాట్లాడడం బీ ఆర్ ఎస్ ధ్వంధ్వ వైఖరికి నిదర్శనం.

Tags:

Advertisement

Latest News