హాకీ టోర్నమెంట్ 2025 క్రీడా సరంభం శుక్రవారంతో ముగిసింది.

By Ravi
On
 హాకీ టోర్నమెంట్ 2025 క్రీడా సరంభం శుక్రవారంతో ముగిసింది.

Dhanalakshmi kakinada TPN 
కాకినాడ, 28.2.2025.
 
కాకినాడ  క్రీడాప్రాధికార సంస్థలోని ఆస్ట్రో హాకీ టర్ఫ్  వేదికగా ఈ నెల 15వ తేదీ నుండి గడచిన రెండు వారాలుగా జరుగుతున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ పురుషులు, మహిళల హాకీ టోర్నమెంట్ 2025 క్రీడా సరంభం శుక్రవారంతో ముగిసింది.  హోరా హోరీగా సాగిన ఈ పోటీల్లో పురుషుల విభాగంలో సెంట్రల్ సెక్రటేరియట్ టీము, మహిళల విభాగంలో ఒడిస్సా సెక్రటేరియట్ టీము విజేతలుగా నిలిచాయి.  శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ఈ టోర్నమెంట్ ముగింపు వేడుకలకు ముఖ్య అతిధులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రీజియన్ ఇన్ కమ్ టాక్స్ డైరక్టర్ జనరల్ ఆనంద్ రాజేశ్వర్ బైవార్,  అర్జున, రాజీవ్ ఖేల్ రత్న అవార్డుల విజేత ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధనరాజ్ పిళ్లై హాజరై విజేత, రన్నర్ అప్ టీములకు ట్రోఫీలను ప్రదానం చేసారు.ఈ సందర్భంగా ముఖ్య అతిధి అనంద్ రాజేశ్వర్ బైవార్ మాట్లాడుతూ తొలిసారి ఆతిధ్యం ఇచ్చి ఈ టోర్నమెంట్ ను విజయవంతంగా నిర్వహించిన  కాకినాడ జిల్లా యంత్రాగానికి అభినందనలు తెలియజేశారు.  అలాగే దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి ఉత్సాహంగా టోర్నమెంట్లో పాల్గొన్ని క్రీడా స్పూర్తితో ఉత్తమ నైపుణ్యాలను ప్రదర్శించిన సివిల్ సర్వీసెస్ ఉద్యోగులను ప్రత్యేకంగా కొనియాడారు. క్రీడలలో  గెలుపు, ఓటములు సాధారణమని, పోరాట స్పూర్తితో పాల్గొనడమే ముఖ్యమని పేర్కొన్నారు.  మంచి శారీరక ఆరోగ్యంతోనే మంచి మానసిక దృఢత్వం చేకూరుతుందని, ప్రతి ఒక్కరూ వయసుతో సంబంధలేకుండా క్రీడలలో పాల్గొవాలని ఆయన కోరారు. మరో ముఖ్య అతిధి ధనరాజ్ పిళ్లై మాట్లాడుతూ దేశంలో  క్రికెట్ లాగ హాకీ క్రీడ పట్ల క్రేజ్ లేనప్పటికీ, యువత ఉత్సాహాంగా హాకీ క్రీడలో పాల్గొనడం ముదావహమన్నారు.కాకినాడలో తొలిసారి నిర్వహించిన హాకీ టోర్నమెంట్ లో ఎందరో మెరికల్లాంటి క్రీడాకారులు పాల్గొన్నారని, వీరంతా తమ నైపుణ్యాలను నిరంతర ప్రాక్టీస్ ద్వారా మరింత  మెరుగు పరచుకుని అంతర్జాతీయ క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహిచాలని కోరారు.హాకీ అకాడమీలలో శిక్షణక పొందుతున్న క్రీడాకారులకు బ్యాట్ లు, బూట్లు వంటి సామాగ్రి సమకూర్చతానన్నారు. కార్యక్రమంలో విశిష్ట అతిధులు జేఎన్టీయూ వీసీ సి.ఎస్.ఆర్.కె.ప్రసాద్, విశాఖపట్నం ఇన్ కంటాక్స్ ప్రిన్సిపల్ కమీషనర్ డా.రాజేంద్రకుమార్, జాయింట్ కలెక్టర్ రాహూల్ మీనా, అసిస్టెంట్ కలెక్టర్ హెచ్.ఎస్.భావన ప్రసంగించి పాల్గొన్న క్రీడాకారులను, విజేతలను అభినందించారు.
 
ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ లో భాగంగా  బహుమతులు పొందిన ఉత్తమ క్రీడాకారుల వివరాలు..
 
మహిళలు:
1. రీతు రాణా   -సెంట్రల్ సెక్రటేరియట్,
2. జోనబ్ ప్రధాన్  - ఒడిస్సా సెక్రటేరియట్,
3. మౌనిక వైంగేడ్ - చతీస్గడ్ సెక్రటేరియట్,
4. కె.ఎల్ నాగలక్ష్మి   -  ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్
పురుషులు: 
1. విశాల్ సింగ్  - సెంట్రల్ సెక్రటేరియట్. 
2. ప్రమోద్  -  ఆర్ఎస్బీ ముంబై. 
3. సూర్య ప్రకాష్  -  ఆర్ఎస్బీ హైదరాబాద్.
4. దీపక్ షైనీ   -  హర్యానా సెక్రటేరియట్.
 
బెస్ట్ టోర్నమెంట్ ఆఫ్ ది ప్లేయర్స్..
పురుషులు
 వినయ్ రాణా  -  సెంట్రల్ సెక్రటేరియట్,
మహిళలు:
 సోనికా   -  సెంట్రల్ సెక్రటేరియట్,
 
ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్-2025లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్ల వివరాలు..
 
పురుషుల:
1. సెంట్రల్ సెక్రటేరియట్,
2. ఆర్ఎస్బీ హైదరాబాద్, 
3. హర్యానా సెక్రటేరియట్.
మహిళలు
1. ఒడిస్సా సెక్రటేరియట్,
2. సెంట్రల్ సెక్రటేరియట్, 
3. హర్యానా సెక్రటేరియట్.
Tags:

Advertisement

Latest News

20వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు 20వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
ఒక ఉద్యోగికి రీపోస్టింగ్‌ ఇవ్వడానికి రూ.20 డిమాండ్‌ చేసి ఆ మొత్తాన్ని సీసీ ద్వారా తీసుకుంటుడగా డీఎంహెచ్‌వోను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు ఇచ్చిన...
శ్రీకాకుళం రూరల్ లో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే గొండు శంకర్ సమీక్ష
సామాన్యులు నష్టపోకుండా చూసే బాధ్యత నాది హామీ ఇచ్చిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ 
ఎంబిబిఎస్ పట్టాదారులు ప్రభుత్వ సేవలో చేరాలి - మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
కేటీఆర్ కు బల్మూర్ వెంకట్ కౌంటర్
బి.ఆర్.ఎస్ రజతోత్సవ పాటను  ఆవిష్కరించిన పార్టీ అధినేత కేసీఆర్ 
సన్న బియ్యం పథకం - పేదల ఆత్మగౌరవ పథకం