తూంకుంటలో హైడ్రా కూల్చివేతలు..
By Ravi
On
మేడ్చల్ జిల్లా: తూంకుంట మున్సిపల్ లో హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలను శనివారం కూల్చివేశారు. తూంకుంటలోని నార్త్ పార్క్ లో గల వెంచర్ లో కబ్జాకు గురైన 30 ఫీట్లు రోడ్డు, 2200 గజాల పార్కు స్థలంతో పాటు 4 ఫ్లాట్లను కొందరు ఆక్రమించి కబ్జా చేసి అందులో ఒక ఇంటి నిర్మాణం, ప్రహరీ గోడ ఏర్పాటు చేశారు. నార్త్ పార్క్ అవెన్యూ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు హైడ్రకు ఫిర్యాదు చేయగా స్పందించిన హైడ్రా అధికారులు ఇన్ స్పెక్టర్ నరేష్ ఆధ్వర్యంలో సిబంది సహాయంతో అక్రమంగా నిర్మించిన రెండు గదులు, ప్రహరీ గోడను కూల్చి వేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీధర్, శానిటరీ ఇన్ స్పెక్టర్ రూప, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, వార్డు ఆఫీసర్లు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Related Posts
Latest News
03 Jun 2025 17:44:01
హైదరాబాద్: పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ సికింద్రాబాద్లోని జేమ్స్ స్ట్రీట్లో ఉన్న రామ్ గోపాల్ పేట పోలీస్ స్టేషన్ భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ