ఆపరేషన్ కగార్ ఆపి..వారితో చర్చలు జరపాలి : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

ముకుళిత హస్తాలతో విన్నవిస్తున్నాం .. మావోయిస్టులతో చర్చలు జరపాలి

By Ravi
On
ఆపరేషన్ కగార్ ఆపి..వారితో చర్చలు జరపాలి : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్:ఆపరేషన్ కగార్ ఆపి మావోయిస్టులతో చర్చలు జరపాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... కేంద్రంలోని ప్రభుత్వాలు వెనకటి నుండి కార్పోరేట్ల తరపున తప్ప సామాన్యుల తరపున ఆలోచన చేయడం లేదు.తమకు తోచిందే అమలు చేస్తాం .. అధికారం ఉంది కాబట్టి ఇష్టారాజ్యంగా పోతాం అన్నట్లు కేంద్రం వ్యవహరిస్తున్నది తప్పితే ప్రస్తుత తరం తరపున ఆలోచన చేయడం లేదు

వరంగల్ బహిరంగసభలో కేసీఆర్ గారు మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగార్ నిలిపివేసి శాంతి చర్చలు చేయాలని కోరడం జరిగిందన్నారు.మన దేశ పౌరులను మనమే కాల్చుకోవడం మంచిది కాదని కేంద్రానికి వివరించినా వారు ఎందుకో ఈ దిశగా ఆలోచించడం లేదు. వ్యవస్థలో భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి .. వాటిని సహించం అనడం మంచి పద్దతి కాదు.

బీజేపీ కాంగ్రెస్ రహిత భారతదేశం అని పిలుపునిచ్చింది .. కానీ ఆ కాంగ్రెస్ పార్టీ వంద సీట్లకు చేరుకున్నది..2026 మార్చి వరకు మావోయిస్టులను ఏరివేస్తాం అన్న నిర్ణయం సరికాదు .. వ్యక్తులను నిర్మూలించడం ద్వారా ఆలోచనలను నిర్మూలించలేరు. ఉన్నత విద్యావంతులు ఎంతో మంది అటు వైపు ఆకర్షించబడుతున్నారు అన్న విషయం ఎందుకు కేంద్రం ఆలోచించడం లేదు ? అక్కడ చంపుతున్న జ్ఞాన సంపదను తిరిగి మనం ఎలా సాధించగలం 22 విద్యార్థి సంఘాలు చర్చలు జరపాలని కేంద్రాన్ని కోరారు .. అనేక పార్టీలు, ప్రజాసంఘాలు చర్చలు జరపాలని కోరుతున్నాయి. కానీ కేంద్రం కనీసం ఆ దిశగా ఆలోచన చేస్తామని కూడా ప్రకటించడం లేదు  ఎందుకు ? ఉగ్రవాద మూకలను ఏరి వేయాలని యావత్ భారతదేశం ముక్తకంఠంతో ఏకతాటిపై నిలబడి కేంద్రానికి, మన సైన్యానికి మద్దతు ఇచ్చింది. కానీ అమెరికా అధ్యక్షుడు రెండు దేశాలను ఒప్పించి కాల్పుల విరమణకు ఒప్పించాం అని ప్రకటించాడు. మరి దేశంలోని మావోయిస్టులతో ఎందుకు కేంద్రం చర్చలు జరపడం లేదు ? మావోయిస్టుల మూలంగా అభివృద్ధి ఆగిపోయింది అన్న వాదన అసంబద్దమైనది. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో నాలుగు దశాబ్దాల మావోయిస్టులు ఉన్నారు .. అంతకుముందు మూడు దశాబ్దాలు అభివృద్ధిని ఎవరు అడ్డుకున్నారు ? తుపాకికి తుపాకి, రక్తానికి రక్తం జవాబు కాదు ... దానికి గొప్ప ఉదాహరణ తెలంగాణ రాష్ట్రం. సాగునీళ్ల రాకతో ఉపాధి కల్పన పెరగడం, ప్రజల చేతికి పని రావడంతో ఇక్కడ మావోయిస్టులకు పనిలేకుండా పోయింది .. ఇక్కడ అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. కేసీఆర్ గారి నాయకత్వంలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఎన్ కౌంటర్ ఎందుకు జరగలేదు ? ఎందుకు నక్సలిజం విస్తరించలేదు ?

సిరిసిల్లలో కేటీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రేవంత్ రెడ్డి పోటో పెట్టాలని కాంగ్రెస్ దాడికి దిగడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. ప్రభుత్వాల తప్పిదాలను సమాజం హర్షించదు .. చరిత్ర క్షమించదు. నల్లచట్టాలకు వ్యతిరేకంగా 16 నెలల పాటు ఢిల్లీ చుట్టూ రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమం చారిత్రాత్మకమైనది .. ఇందులో 700 మంది చనిపోవడం బాధాకరం. వారితో చర్చలు జరపకుండా ఆ ఉద్యమాన్ని కూడా కించపరిచారు .. ఆది దేశవ్యాప్తం అవుతుంది అన్న విషయం తెలుసుకుని ప్రధానమంత్రి దేశానికి క్షమాపణలు చెప్పారు

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ వైఫల్యాలు...
ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ వైఫల్యాలు అన్ని మీడియా సంస్థల వార్తలతోనే తేలిపోయింది. అయినప్పటికి ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. యాసంగి కోతలు పూర్తయి వానాకాలం వచ్చినప్పటికి నెలల తరబడి కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతుంది. ధాన్యం కొనుగోళ్లలో అడ్డగోలుగా కోతలు విధిస్తున్నా రైతుల అభ్యంతరాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. మిల్లర్లను ప్రశ్నిస్తే దిక్కున్న చోట చెప్పుకోమంటున్నారు .. సీఎం ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదు అంటే అసలు పాలన మీద పట్టుందా ? ప్రశ్నించిన వారిని దబాయిస్తున్నారు .. వారి మీద కేసులు పెట్టి వేధిస్తున్నారు. ప్రభుత్వ నిర్భంధం ఇలాగే కొనసాగితే  ప్రజలు తిప్పికొడతారు. కేసీఆర్ పాలనలో రైతులను వ్యవసాయం విషయంలో, పంటల సాగు విషయంలో ఇక్కడి వాతావరణ పరిస్థితులు వివరించి పంటల మార్పిడిని ప్రోత్సహించాంవరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ వంటి పంటల సాగును ప్రోత్సహించాం .60 లక్షల ఎకరాలలో వరి సాగు నుండి 20 లక్షల వరకు ఇతర పంటల వైపు మల్లాలని చైతన్యం చేశాం.  ఉమ్మడి రాష్ట్రంలో 35, 40 వేలు ఎకరాలలో ఉన్న ఆయిల్ పామ్ సాగును 2 లక్షల ఎకరాల వరకు ఆయిల్ పామ్ సాగును పెంచాం.వంట నూనెల కోసం దిగుమతుల మీద ఆధారపడకుండా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తే లక్ష కోట్ల వరకు ఆదా అవుతుందని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాం  అని మీడియాతో తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

Advertisement

Latest News

పబ్ నిర్వాహకుల దౌర్జన్యం.. లైట్లు తీసి మరి మహిళలపై దాడి.. పబ్ నిర్వాహకుల దౌర్జన్యం.. లైట్లు తీసి మరి మహిళలపై దాడి..
జూబ్లీహిల్స్‌లోని బేబీలాన్ పబ్‌లో తాము ఆర్డర్ చేయని డ్రింక్స్‌కు బిల్ వేశారని ప్రశ్నించినందుకు సిబ్బంది కస్టమర్లపై దాడికి పాల్పడ్డారు. పబ్‌లో లైట్లు ఆర్పేసి తన తల్లి, చెల్లిని...
కొండాపూర్ లో హైడ్రా కూల్చివేతలు..
పెండింగ్ లో ఉన్న యుఐ కేసులను వెంటనే పరిష్కరించాలి. సీపీ సుధీర్ బాబు..
గిరిజన ఉద్యోగులకు 100% జీతాలు చెల్లింపు..కృతజ్ఞతలు తెలిపిన గిరిజన సంఘాలు..
ఈ స్పెషల్ రూల్స్ మీ కోసం...
TGiCCCలో RTA డేటాబేస్ అనుసంధానం..
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ...