ఎందుకైనా మంచిది మాస్క్ లు రెడీ చేసుకోండబ్బా...

By Ravi
On
ఎందుకైనా మంచిది మాస్క్ లు రెడీ చేసుకోండబ్బా...

పోయింది  అనుకున్న కరోనా మళ్లీ వచ్చిందబ్బా.. ఈసారి సాదా సీదా కాదు బలం పెంచుకుని దొరికిన వారిని దొరికినట్లు  మింగేయాలని చూస్తోందట.. మన దగ్గర కాదు కదా అని నిర్లక్ష్యంగా ఉంటే ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని చెబుతున్నారు డాక్టర్లు.. తలనొప్పి అనుకోకుండా విసుగ్గా ఉన్న మాస్క్ లు, శానిటైజర్లు రెడీగా ఉంచుకోమని చెబుతున్నారు. ఎందుకంటే భారత్ లోకి కూడా అడుగుపెట్టింది అని తెలుస్తోంది.
 సమసిపోయిందనుకున్న కరోనా వైరస్ కేసుల సమస్య మళ్లీ తలెత్తింది. సింగపూర్, హాంకాంగ్ లకే పరిమితమైందనుకున్నప్పటికీ- క్రమంగా విస్తరిస్తోంది. భారత్ లోనూ అడుగు పెట్టింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్, సూపర్ స్టార్ మహేష్ బాబు బంధువు, నటి శిల్పా శిరోద్కర్.. ఈ కోవిడ్ కేసుల బారిన పడ్డారు. అవే కాదు- దేశంలో 257 కరోనా వైరస్ యాక్టివ్ కేసులు నమోదయ్యాయి కూడా. వివిధ రాష్ట్రాల్లో ఈ కేసులు వెలుగులోకి వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ కేసుల పెరుగుదలపై అప్రమత్తంగా ఉన్నామని వెల్లడించింది. ఎప్పటికప్పుడు ఆరా తీస్తోన్నామని పేర్కొంది.

దేశంలో కోవిడ్ పాజిటివ్ కేసుల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC), ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ (EMR), డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS)అధికారులు ఇందులో పాల్గొన్నారు.
కొన్ని రోజులుగా సింగపూర్, హాంకాంగ్లలో కోవిడ్ 19 పాజిటివ్ కేసుల పెరుగుదలపై చర్చించాయి. అందుబాటులో ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం- ఆయా కేసుల తీవ్రత చాలావరకు స్వల్పమేనని అంచనా వేశాయి. ఆయా కేసుల్లో అసాధారణ తీవ్రత లేదని, ఈ వైరస్ బారిన పడ్డ వాళ్లెవరూ కూడా మరణించలేదని అధికారులు పేర్కొన్నారు.
దేశంలో ప్రస్తుతం కోవిడ్ 19 పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని అన్నారు. సోమవారం నాటికి దేశంలో యాక్టివ్ కోవిడ్-19 కేసుల సంఖ్య 257గా నమోదైంది. దేశ జనాభాను పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య చాలా తక్కువేనని, వీటి తీవ్రత కూడా స్వల్పంగానే ఉందని, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ద్వారా దేశంలో కోవిడ్-19 సహా శ్వాసకోశ వైరల్ వ్యాధుల పర్యవేక్షణ కోసం బలమైన వ్యవస్థ అందుబాటులో ఉందని అధికారులు గుర్తు చేశారు. ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల ముప్పు సైతం పొంచివుంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండక తప్పదని చెబుతున్నారు. సీజనల్, అంటువ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది. శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు తలెత్తితే వెంటనే డాక్టర్ ను సంప్రదించాల్సి ఉంటుందని చెబుతున్నారు.images

Tags:

Advertisement

Latest News

వృద్ధాప్యంలో ఓ తోడు కావాలా.. మరి వీళ్లు మిమ్మల్ని కలిశారా వృద్ధాప్యంలో ఓ తోడు కావాలా.. మరి వీళ్లు మిమ్మల్ని కలిశారా
మీకు వయసు మీద పడిందా.. వృద్ధాప్యంలో ఓ తోడు కావాలని చూస్తున్నారా.. మళ్లీ పెళ్లి చేసుకుంటే పిల్లను ఎవరు ఇస్తారు అని ఆలోచిస్తున్నారా.. డోంట్ వర్రీ.. బీ...
రాజ్ భవన్ లో దొంగలు పడ్డారు....
ఎందుకైనా మంచిది మాస్క్ లు రెడీ చేసుకోండబ్బా...
పరిగిలో ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి..
దొంగనోట్లతో భారీ స్కెచ్ వేశాడు.. ఇంతలో
6గురికి ఎంప్లాయీ ఆఫ్ ద మంత్ సేఫ్టీ అవార్డుల ప్రధానం
కలిసికట్టుగా పండుగలు జరుపుకోండి